Saturday, April 20, 2024
- Advertisement -

మారుతీ భలే కాపీ కొట్టేశావే.. ఎవరికీ డౌట్ రాదనుకున్నావా..?

- Advertisement -

చిన్న దర్శకుడిగా చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి టాప్ దర్శకుడిగా సెటిల్ అయినా మారుతి కి గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి సినిమా సంగతి లేదు.. నాగ చైతన్య తో శైలజా రెడ్డి అల్లుడు సినిమా ఫ్లాప్ తరువాత మారుతి చేసిన ప్రతిరోజు పండగే సినిమా సూపర్ హిట్ అయినా మారుతి ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు..  ఈరోజుల్లో అనే చిన్న బడ్జెట్ సినిమా చేసి అందరి కళ్ళల్లో పడ్డ మారుతి ఆ తరువాతి చిత్రం బస్ స్టాప్ తో నూ మంచి పేరు తెచ్చుకున్నాడు.. ఈ రెండు సినిమాలు ఇచ్చిన హిట్ తో ఇక మారుతీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.. మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి.. అల్లు శిరీష్ తో చేసిన కొత్త జంట పరవాలేదనిపించుకున్నా మారుతి ఒకే రకం సినిమాలు చేస్తున్నాడని వార్తలు వచాయి..

దాంతో ఆ మరక ను పోగొట్టుకోవడానికి మారుతి నాని భలే భలే మొగాడివోయ్ లాంటి హిట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..  ఈ సినిమా అటు నాని తో పాటు మారుతి కి కూడా మంచి పేరును తెచ్చి పెట్టాయి.. మారుతీ ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు కొట్టి స్టార్ దర్శకుడిగా స్థిరపడ్డాడు.. తాజాగా సాయి ధరం తేజ్ తో ప్రతిరోజు పండగే సినిమా చేసి తనలో ఈ టైప్ దర్శకుడు కూడా ఉన్నాడని చెప్పకనే చెప్పాడు..

అయితే ఇంత మంచి హిట్ ఇచ్చినా మారుతి కి మాత్రం ఇప్పుడు హీరో సెట్ అవ్వడంలేదట.. ఇప్పటికే రవితేజ తో సినిమా కన్ఫర్మ్  అని వార్తలు వచ్చినా రవితేజ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.. అయితే ఈ సినిమా కథపై ఇప్పటినుంచే విమర్శలు వస్తున్నాయి.. టెంపర్ సినిమాలో నేరస్థులకు కొమ్ముకాసి, ఒకనొక ఇన్సిడెంట్ తో మనసు మార్చుకుని మనిషి అవుతాడు హీరో. ఇప్పడు కాస్త అటు ఇటుగా ఇలాంటి లైన్ తోనే దర్శకుడు మారుతి ఓ కథ అల్లుకున్నారు. క్రిమినల్స్ కు వత్తాసుపాడే లాయర్ కథ. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ విషయం వినిపిస్తోంది.  ఇలాంటి నెగిటివ్ షేడ్ వున్న లాయర్ కథనే జాలీ ఎల్ ఎల్ బి 2. అక్షయ్ కుమార్ హీరో. ఈ సినిమాను ఎప్పుడో కొని వుంచారు హారిక హాసిని జనాలు. పవన్ తో తీద్దామనా? మరెవరితో తీద్దామనో..మొత్తానికి కొని వుంచారు. ఇప్పుడు మారుతి కనుక దాదాపు అదే సబ్జెక్ట్ తో సినిమా చేస్తే, ఇక జాలీ ఎల్ ఎల్ బి 2 సినిమాను లైబ్రరీలో దాచుకోవడమే. మరి ఈ సినిమా ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి..

గ్లామర్ తో రచ్చ రచ్చ చేస్తున్న భాను శ్రీ..!

మహేష్ , బన్నీ కి వారు కరువయ్యరుగా..?

ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇంత ప్లాన్ చేస్తున్నాడా….?

బెడ్ రూమ్ సీన్స్ చేసి తప్పు చేశాను

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -