Sunday, April 28, 2024
- Advertisement -

తెలంగాణాలో హల్చల్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ రేంజ్ లో దుమారం రేపుతుందో అందరికి తెలిసిందే.. జగన్ పై న్యాయవాదులు ఈ విషయంపై చిన్న పాటి యుద్ధం ప్రకటించారని చెప్పొచ్చు.. తమ విషయాలు వైసీపీ పార్టీ సీక్రెట్ గా ఫోన్ ట్యాపింగ్ ద్వార తెలుసుకుని గుట్టు రట్టు చేస్తున్నారని వారి వాదన.. ఆ తర్వాత ఈ విషయం మరుగున పడిన తాజాగా ఇదే అంశాన్ని తెలంగాణాలో బీజేపీ పార్టీ లేవనెత్తడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..  తెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నిక అన్ని పార్టీ లకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి అందరికి తెలిసిందే..

ఎలాగైనా ఇక్కడ గెలవాలని కాంగ్రెస్, బీజేపీ లతో సహా అధికార పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి..  ఇక్కడ భారీ మెజారిటీ తో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీ ఆర్ ఎస్ ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ , బీజేపీ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి..ఇక తాజాగా బీజేపీ పార్టీ కొత్తరకం ప్రచారానికి పూనుకుందని చెప్పాలి.. రెండు రోజుల కిందట హైదరాబాద్ శివార్లలో రెండు కార్లలో తరలిస్తున్న రూ. 40 లక్షల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు. ఒక రోజు తర్వాత పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టి ఆ సొమ్ము బీజేపీ అభ్యర్థి రఘునందన్‌దిగా ప్రకటించారు. దానికి సంబంధించిన ఆడియో టేపులు కూడా ఉన్నాయన్నారు. దీంతో రఘునందన్ రావు నేరుగా కేంద్ర ప్రభుత్వానికి..కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

తన ఫోన్ ట్యాపింగ్ చేసి తమ రహస్యాలు తెలుసుకుంటున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొంటున్నారు. ఫోన్ల ట్యాపింగ్‌పై విచారణ జరపాలని రఘునందన్‌రావు హోంమంత్రి అమిత్ షాను.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఉపఎన్నిక నేపధ్యంలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేసి వారి వ్యూహాలను కనుక్కుంటోందని.. వారికి ఆర్థిక సాయం ఎక్కడ నుంచి అందుతుందో తెలుసుకుని.. పోలీసుల సాయంతో పట్టుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సారి నేరుగా బీజేపీ అభ్యర్థికే ఈ పరిస్థితి ఎదురవడం.. ఆయన నేరుగా కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో .. కేంద్రం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది.

కోదండ రాం ఒంటరిగా వేల్లాల్సిందేనా..?

కెసిఆర్ కి షాక్ ఇచ్చేలా రంగంలో కి దించిన కాంగ్రెస్..?

ఆ ఎన్నికలపైనే కెసిఆర్ ఫోకస్..!

కెసిఆర్ ప్రభుత్వం కూల్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -