Tuesday, May 7, 2024
- Advertisement -

అతను ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేసుకుంటా.. అవికా గోర్!

- Advertisement -

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా యావత్ భారతాన్ని ఎంతగానో ఆకట్టుకున్న అవికాక గోర్ అందరికీ సుపరిచితమే. సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నారి పెళ్ళికూతురు తరువాత రాజ్ తరుణ్ హీరోగా అన్నపూర్ణ బ్యానర్ పై “ఉయ్యాల జంపాల” సినిమా ద్వారా హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించిన అవికా తరువాత పలు సినిమాలలో నటించి మెప్పించారు.

ప్రస్తుతం తెలుగులో సినిమా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్ళిన ఈమె హిందీలో కాదిల్‌ అనే ప్రైవేట్‌ సాంగ్‌లో నటుడు ఆదిల్‌ ఖాన్‌ సరసన ఆడిపాడింది. ఈ నేపథ్యంలో వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికాగోర్ తన పెళ్లి గురించి ఆశక్తికర విషయాలను తెలిపారు.

Also read:అది మాటల్లో చెప్పలేని బాధ.. ఆందోళనలో నటి పాయల్?

గతంలో తను హైదరాబాద్‌కు చెందిన మిలింద్‌ చంద్వానీతో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను పెళ్లెప్పుడు అని హోస్ట్ అడగగా.. పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నాది పెళ్లి చేసుకునే వయసు కాదు..కానీ మిలింద్‌ చేసుకుందామని అడిగితే దానికి నేను రెడీగా ఉన్నాను. తను రేపే మన పెళ్లి అంటే చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో త్వరలోనే ఈ చిన్నారి పెళ్ళికూతురు పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు కనిపిస్తుంది.

Also read:లాక్‌డౌన్‌ లో బిగ్ బాస్ షూటింగ్… సీల్ చేసిన పోలీసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -