Friday, May 3, 2024
- Advertisement -

ఐశ్వర్యారాయ్ ఆత్మహత్య నిజమేనా?

- Advertisement -
Fake News Aishwarya Rai Bachchan

సోషల్ మీడియా వచ్చాక.. ఎంత మంచి జరుగుతుందో అంతే.. చేడు జరుగుతోంది. అక్కడ సరదాకు చేసే కొన్ని ఉత్తుత్తి ప్రచారాలు జనాల మనోభావాల్ని దారుణంగా దెబ్బ తీస్తున్నాయి. సోషల్ మీడియాలో నిప్పు రాజేసి వదిలేస్తే.. ఇక మీడియా దాన్ని పట్టుకుని పెద్ద మంటగా మార్చేస్తుంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాలు దారుణంగా ఉంటున్నాయి. కొందరు ప్రముఖుల్ని బతికుండగానే చంపేసి అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తున్నారు కొందరు జనాలు.

ఇప్పటికే చాలామంది సెలబ్రెటీల గురించి తప్పుడు ప్రచారం చేసిన ఆకతాయిలు.. తాజాగా మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ అభిమానులతో చెలగాటమాడారు. ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణబీర్ కపూర్‌తో ఐశ్వర్యారాయ్ రొమాన్స్ విషయంలో ఆమె కుటుంబం చాలా సీరియస్‌గా ఉందని.. ముఖ్యంగా జయా బచ్చన్ కోడలిపై అగ్గిమీద గుగ్గిలం అయిపోతున్నారని.. ఈ సినిమా విషయంలో కుటుంబం అభీష్టానికి వ్యతిరేకంగా ఐశ్వర్య నడుచుకుందని కొన్నాళ్ల కిందట పెద్ద ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

దీన్ని ఆధారంగా చేసకుని ‘ఐశ్వర్య ఆత్మహత్య’ అనే కథనాన్ని సృష్టించేశారు. ఈ చిత్రం రిలీజ్ తర్వాత బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఐశ్వర్యకు వేధింపులు ఎక్కువయ్యాయని.. తర్వాత గొడవ పెద్దదైందని.. ఈ క్రమంలో ఐశ్వర్య నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మొదలవడంతో నెటిజన్లు విస్మయానికి గురయ్యారు. ఐతే ఇందులో వాస్తవమెంతో తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతుండగా.. తన భర్త అభిషేక్‌తో కలిసి మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ షోకు హాజరై ఈ ప్రచారానికి తెరదించింది ఐశ్వర్య. ఇప్పటివరకు కొంచెం వయసు మళ్లిన వాళ్ల విషయంలోనే ఇలాంటి ప్రచారాలు జరిగేవి కానీ.. ఐశ్వర్య లాంటి వాళ్లను కూడా వదలకపోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం.

Related

  1. నాగార్జున- ట‌బూ మధ్య ఉన్న బంధం ఇదే!
  2. రష్మీకి ఫోన్ చేసి ఏడిపిస్తుంది ఎవరు?
  3. వామ్మో.. రక్షితని ఇప్పుడు ఎలాందో చూస్తే షాక్ అవుతారు!
  4. నితిల్ లవ్ గురించి ఎన్టీఆర్ కు తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -