Friday, May 3, 2024
- Advertisement -

’నిశ్శబ్దం’ మూవీ రివ్యూ

- Advertisement -

అనుష్క ముఖ్య పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ’నిశ్శబ్దం’. ఈ సినిమా థ్రిలర్ గా తెరకెక్కి ఓటీటీలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : ఆంటోనీ (మాధవన్) ఫేమస్ చెల్లో ప్లేయర్. చెవిటి, మూగ అమ్మాయి అయిన సాక్షి (అనుష్క) పెయింటింగ్స్ వేస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమ వరకు వెళ్లి ఎంగ్జ్మేంట్ చేసుకుంటారు. నిశ్చితార్దం అయిన రెండు రోజులకే సాక్షి స్నేహితురాలు సోనాలి (షాలిని పాండే) కనిపించకుండా పోతుంది. సోనాలి కోసం సాక్షి దిగులు చెందుతుంది. సాక్షి దిగులు నుండి బయటకు తీసుకొచ్చేందుకు ఆంటోనీ ఆమెని హాలిడేకి తీసుకెళ్తాడు. తిరిగొచ్చేటప్పుడు హాంటెడ్ హౌస్ వుడ్‌సైడ్ విల్లాలో ఒక పెయింటింగ్ కోసం వెళ్తారు. అక్కడ ఆంటోనీ మరణిస్తాడు. కొన్నేళ్ళ క్రితం అక్కడ ఓ జంట మరణాలకు సంబంధించి అధారాలు లభించకపోవడంతో ఆత్మ కారణమని అందరు నమ్ముతారు. ఆంటోనీ మరణంకు కూడా ఆత్మ కారణమా ? లేదంటే మరో కారణం ఉందా ? ఈ కథలో మహా (అంజలి), కెప్టెన్ రిచర్డ్ (మైఖేల్ మ్యాడసన్) పాత్రలు ఏం చేశాయి అనేది సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ : సాక్షి పాత్ర అనుష్క అద్భుతంగా చేసింది. చాలా ఢిఫరెంట్ రోల్ చేసింది. డైలాగ్స్ లేకపోయినప్పటికి అద్భుతంగా హావభావాలు పండిచింది. సినిమా చూస్తున్నంత సేపు ఆమె అనుష్క కాకుండా ఆమె పాత్రే కనిపిస్తూ ఉంటుంది. మాధవన్ క్యారెక్టర్‌కి వంద శాతం న్యాయం చేశాడు. క్రైమ్ డిటెక్టివ్‌గా ఇంపార్టెంట్ రోల్‌లో అంజలి కనిపించారు. వెయిట్ తగ్గడంతో క్యారెక్టర్‌కి తగ్గట్టు పర్‌ఫెక్ట్ ఫిజిక్‌లో ఉన్నారు. షాలిని పాండే క్యారెక్టర్ లెంగ్త్ తక్కువ అయినప్పటికీ గుర్తుండిపోయే రోల్ చేసింది. ఫస్టాఫ్ కొంచెం బాగా తీశారు. సినిమాటోగ్రాఫర్ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. గోపీసుందర్ ట్యాన్లు మళ్లీ వినొచ్చు. గిరీష్ గోపాలకృష్ణన్ నేపథ్య సంగీతం పర్వాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్ లో వున్నాయి. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదని ప్రతి సీన్ చెబుతోంది.

మైనస్ పాయింట్స్ : థ్రిల్లర్ సిన్మాలకు కథ కంటే స్క్రీన్ ప్లే చాలా అవసరం. ఇలాంటి సినిమాలో విలన్ ఎవరు అన్నది చివరకు వరకు చెప్పకూడదు. కానీ ఈ సినిమా చూస్తుంటే హంతకుడూ ఎవరు అన్నది ఓ ఐడియా వస్తుంది. మొదటి సిన్ లో క్యూరియాసిటీ పెంచారు. తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. స్క్రీన్ ప్లేలో టెక్నిక్స్ బాలేవు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు డిస్టర్బ్ గా ఉన్నాయి. ఈ సినిమాకి సాంగ్స్ అవసరం లేదు. ఇంగ్లీష్ డైలాగ్స్ ఎక్కుగా వాడారు. థ్రిలర్ గా తెరకెక్కిన ఆ ఫీల్ ఎక్కడ కలగదు. దర్శకుడు ఈ సినిమా కోసం మరింత పనిచేయాల్సింది.

చివరగా : హారర్ మూవీలా సినిమా స్టార్ట్ అయినా.. ఇది హారర్ మూవీ కాదు. సినిమా మొదట్లో థ్రిలింగ్ గా అనిపిస్తోంది. తర్వాత ఆ థ్రిల్ పోతుంది. స్క్రీన్ ప్లే తో మాయ చేయడానికి ట్రై చేశారు కానీ అది కుదరలేదు. ఫస్టాఫ్ సోసోగా వున్నప్పటికీ, సెకండాఫ్ మరీ బోర్ గా ఉంది. ఫ్రీ టైం ఉంటే ఈ సినిమా ఓ సారి చూడొచ్చు.

బిగ్‌బాస్ లో గాయపడిన అవినాష్.. ఏం జరిగింది ?

బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్.. చెప్పుతో కొట్టాలి : కళ్యాణి

బాలు ఆస్పత్రి ఖర్చు ఎంతైంది.. వివాదం చెలరేగింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -