Thursday, May 2, 2024
- Advertisement -

కెసిఆర్ లానే సోము కూడా వాగ్దానాలు చేస్తున్నాడే..?

- Advertisement -

రాజకీయాల్లో ఓ పార్టీ గెలుపుకోసం నాయకులూ ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్తారు. అయితే అవి కల్లబొల్లిమాటలా కావా అనేది వారు అధికారంలోకి వచ్చాకా గానీ తెలీదు.. రాజకీయంలో ముఖ్య అస్త్రం ఏంటంటే ప్రచారం.. ఈ ప్రచారాన్ని నమ్ముకుని పార్టీ లో ఎన్నికల్లోకి వస్తాయి. ప్రచారం వీక్ గా ఉంటే పార్టీ ప్రజల్లోకి తొందరగా వెళ్ళలేదు.. అందుకే ప్రచారం తో పాటు ఎదుటి పార్టీ ని ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా విమర్శలు చేస్తూ తమ పార్టీ ని ప్రచారం చేసుకుంటారు.. అయితే ఈ విషయంలో బీజేపీ పార్టీ ఒక ఆకు ఎక్కువే చదివింది అని చెప్పొచ్చు..

దేశంలో బీజేపీ పార్టీ రెండు సార్లు అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి వచ్చిందంటే వారి ప్రచారం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక ఏపీ లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న బీజేపీ పార్టీ ప్రచారం విషయంలో మంచి ప్రతిభను కనపరుస్తుంది.. సోము వీర్రాజు వచ్చిన తరువాత బీజేపీ పార్టీ ప్రజల్లోకి అతి తొందరగా వెళ్ళింది అంటే అది సోము వీర్రాజు వల్లే అని చెప్పాలి.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా తాము అధికారంలోకి వ‌స్తామ‌ని ఆయ‌న చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ.. జ‌న‌సేన‌తో క‌లిసి అధికారంలోకి వ‌స్తామ‌ని కూడా చెబుతు న్నారు సోము వీర్రాజు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అదే స‌మ‌యంలో ఆయ‌న ఈ ద‌ఫా రాష్ట్రానికి కాపు నేతే సీఎం అవుతార‌ని ఆయ‌న ప్రచారం చేస్తుండ‌డం చ‌ర్చకు వ‌స్తోంది. చంద్రబాబు లాగా సోము కూడా కులరాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడని ఈ స్టేట్మెంట్ తో అర్థమైపోతుంది.. కాపు నేత సీఎం అయితే కాపులందరు బీజేపీ సపోర్ట్ చేస్తారన్నది అయన ఆలోచన అని ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అదే సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. మ‌రి రేపు బీజేపీ- జ‌న‌సేన కూట‌మి నిజంగానే అధికారంలోకి వ‌స్తే.. వీరిద్దరిలో ఎవ‌రు ప‌గ్గాలు చేప‌డ‌తారు అనే ప్రశ్న యూథపఃన్నమవుతున్నా కాపు వర్గాలు బీజేపీ జనసేన తో నడుస్తాయని ఆయన ఆలోచన..కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను, క్రియాశీల కార్యకర్తలను బీజేపీలోకి ఆహ్వానించే పనిలో భాగంగా.. ఈ వ్యాఖ్యలు చేస్తున్నార‌ని చెబుతున్నారు.  మరి సోము ఈ కాపు ఎత్తుగడ ను ప్రజలు ఏవిధంగా స్వీకరిస్తారో చూడాలి..

చంద్రబాబు కు ఇప్పుడు వాళ్ళే దిక్కా..?

సోము దూకుడుకు కారణం ఇదా..?

బీజేపీ తో తెంచుకునే ఆలోచనలో పవన్ కళ్యాణ్..?

బాబుకు పెద్ద షాక్.. వైసీపీలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -