హీరోయిన్ చార్మి.. మొన్నటివరకు.. తన అందాలతో కుర్రకారు రెచ్చగొట్టిన భామ. 50 పైగా సినిమాలతో టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఈ బ్యూటీ.. ఇప్పుడూ ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. ఆమె చివరిగా చేసిన జ్యోతిలక్ష్మి.. ఆ తర్వాత సినిమాలకి విరామం ఇచ్చేసి.. డైరెక్టర్ పూరీ జగన్నాద్ పక్కకి చేరిపోయిన ఈ భామ పూరీ కనెక్ట్స్ అనే సంస్థకు సిఇఓగా ఇండస్ట్రీకి కొత్త కొత్త భామలని పరిచయం చేసుకునే పని పెట్టుకుంది. అలాగే పూరీ చేసే అన్ని సినిమాలకి ప్రమోషన్ లో భాగంగా ఉంటుంది. ప్రస్తుతం పూరీ బాలకృష్ణతో చేస్తున్న పైసా వసూల్ సినిమాకి నిర్మాణ సంస్థ చార్మికి నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిందన్న వార్త బాగా వినిపించింది. అయితే అందంతా అబద్దమేనట.. మొత్తం సినిమాకి 25కోట్ల బడ్జెట్ లో ముగించారట! అందులో ఎక్కువ భాగం హీరో రెమ్యునరేషన్ కిందే పోయిందట! ఇక తనకు అంత చెప్పుకుందట. పూలమ్మిన చోటే కాయలమ్మడం అంటే ఇదే అంటున్నారు సినీ జనాలు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొని బాలకృష్ణ తో అల్లరి పిడుగు సినిమాలో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఓ ఉద్యోగిగా జీతం మాత్రమే తీసుకొని బాలకృష్ణ సినిమాకి పని చేయడం అంటే కాస్తా విచిత్రమే మరి. అయిన పరిశ్రమలో హీరోయిన్ గా కెరియర్ ఎక్కువ కాలం ఉండదని ఇప్పటి తరం భామలందరికీ భాగా తెలిసినట్లు ఉంది. అందుకే అవకాశాలు వచ్చినప్పుడే డబ్బు సంపాదించుకొని, తర్వాత. మరో కొత్త మార్గం వెతుక్కునే పనిలో పడ్డారు.
- Advertisement -
పాపం చార్మీ.. హీరోయిన్ నుంచి ఏ స్థాయికి వెళ్లిందో తెలుసా..?
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -