Wednesday, May 15, 2024
- Advertisement -

ఛార్మికి షాక్ ఇచ్చిన హైకోర్టు

- Advertisement -

ఇటివలే హీరోయిన్ చార్మి.. సిట్ విచారణ తీరు బాలేడని.. హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టు తాజాగా వాదనలు ముగిసిన తర్వాత తీర్పును వెల్లడించింది. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ తీరును సరిగా లేదంటూ హైకోర్టుకు వెళ్లిన హీరోయిన్ చార్మీకి ఇప్పుడు షాక్ తగిలింది. ఛార్మి ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే అని ఆదేశించింది కోర్టు. కాకపోతే చార్మి ఇష్టపూర్వకంగానే రక్తం, గోళ్లు, జుట్లు శాంపిల్స్ ఇవ్వదనుకుంటే సిట్ అధికారులు బలవంతంగా తీసుకోరాదని కోర్టు ఆదేశించింది.

ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విచారించాలని.. సమయం ఇంకా అవసరం అని అధికారులు భావిస్తే.. తర్వాత రోజు మళ్లీ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అడ్వకేట్ సమక్షంలో విచారించాలన్న చార్మి అభ్యర్థననూ కోర్టు తిరస్కరించింది. కేసులో సాక్షిగా మాత్రమే సిట్ విచారిస్తుందని.. న్యాయవాది అవసరం లేదని అభిప్రాయపడింది. ఒక్క విషయంలో మాత్రం కోర్టు చార్మికీ అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అబ్కారీ భవన్ కు మాత్రమే రావాలనే బలవంతం ఏమీ లేదని.. చార్మి ఎక్కడికి రమ్మంటే అక్కడే వెళ్లే విచారణ చేస్తామని ఎక్సైజ్ శాఖ కూడా కోర్టుకు తెలిపింది. విచారణ ఎక్కడ జరపాలి అనేది ఇప్పుడు చార్మి ఇష్టం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -