Saturday, May 18, 2024
- Advertisement -

ఛార్మి గురించి అకున్ సబర్వాల్ ఏం చెప్పారంటే..?

- Advertisement -

డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు అందించి.. విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అందులో బాగంగానే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి చార్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో విచారణలో భాగంగా మహిళ కావడంతో ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడే విచారణ జరుపుతామని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ నెల 26న హాజరు కావాలని తెలంగాణ ఆబ్కారీ శాఖ సిట్‌ అధికారులు చార్మికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో చార్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సిట్ చేస్తున్న విచారణపై తన అనుమానాలున్నాయని.. విచారణకు వచ్చిన వారి నుంచి రక్తం, వెంట్రుకటు, గోళ్లు బలవంతంగా సేకరిస్తున్నారని.. అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని చార్మి పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణకు కుటుంబసభ్యులను అనుమతించరు కావున.. తనతో పాటు న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె హైకోర్టును కోరారు. అయితే ఇదే విషయంపై ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడారు. జిల్లాల్లో డ్రగ్స్ వినియోగం, సాగు వంటి విషయాలతో పాటు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో పాల్గొనే విషయంపై మాట్లాడామని తెలిపారు.

డ్రగ్స్ కేసులో విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. విచారణ పూర్తి కాకుండా ఆ విషయం గురించి మాట్లాడటం సరికాదని అన్నారు. సినీ నటి ఛార్మీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ గురించి ప్రశ్నించగా, ఆయన దానిని పట్టించుకోలేదు. దీంతో వారిని విచారించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్టు అర్ధమవుతోంది. ఇక చార్మీని విచారించేందుకు సమర్థులైన మహిళా అధికారిణులను ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -