Saturday, April 27, 2024
- Advertisement -

య‌మునా న‌దిలో పదుల సంఖ్యల్లో మృతదేహాల కలకలం..

- Advertisement -

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తుంది. రోజుకి నాలుగు లక్షలకు పైగా కేసులు.. నాలుగు వేలకు పైగా మరణాలు సంబవిస్తున్నాయి. తాజాగా యమునా నదిలో మృతదేహాల కలకలం భయాన్ని సృష్టిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యల్లో య‌మునా న‌దిలో తేలుతున్న శ‌వాల‌ను చూసి యూపీలోని హ‌మీర్‌పూర్‌లోని ప్ర‌జ‌లు వ‌ణుకుతున్నారు. వీళ్లంతా క‌రోనాతో చ‌నిపోయిన వాళ్లేమో అని చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు.

ఈ ఘటన ఆదివారం ఉత్తరప్రదేశ్ లోని హామీర్ పూర్ లో చోటు చేసుకుంది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ఇలా నదిలో పడేశారని గ్రామస్థులు చెబుతున్నారు. దీనిపై వారు పోలీసులకు సమాచారమిచ్చారు. హ‌మీర్‌పూర్‌, కాన్పూర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనాతో చాలా మంది చనిపోతున్నారని, వారి అంత్యక్రియలకు శ్మశానం సరిపోవట్లేదని, దీంతో శవాలను ఇలా నదిలో పడేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

స్థానిక అధికారులు వచ్చి నదిలో ఉన్న శవాలను పరిశీలించారని, నదిలోనే వారి శవాలను డిస్పోజ్ చేయాలని నిర్ణయించారని అంటున్నారు. అయితే హామీర్ పూర్ నుంచి కాన్పూర్ జిల్లాల వరకు రోజూ లెక్కకు మించిన మరణాలు నమోదవుతున్నాయని, కానీ, పట్టించుకునేవారు లేరని ఆయా జిల్లాల గ్రామస్థులు చెబుతున్నారు.

యమునా నది పవిత్రమైనదిగా స్థానికులు భావిస్తుంటారని, అందుకే నదిలో మృతదేహాలను ఖననం చేస్తుండవచ్చని హామీర్ పూర్ ఏఎస్పీ అనూప్ కుమార్ సింగ్ చెప్పారు. కరోనా భయంతో శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకూ జనాలు ముందుకు రావట్లేదని, దీంతో నదిలో పడేస్తున్నారని చెప్పారు.

ఉప్పెన దర్శకుడికి షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇప్పట్లో కష్టమే?

అసోం 15వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హిమంత బిశ్వ శర్మ

బెంగళూరు దారుణం.. 6 వేల మంది కరోనా రోగులు అదృశ్యం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -