Saturday, April 20, 2024
- Advertisement -

మాట తప్పిన కాజల్​.. ప్రభాస్​ కోసమేనా?

- Advertisement -

చందమామ కాజల్​.. టాలీవుడ్​లో టాప్​ హీరోయిన్​గా ఎదిగింది. ఒకప్పుడు ఆమె డేట్స్​ కోసం దర్శక, నిర్మాతలు క్యూ కట్టేవారు. తెలుగులో అగ్రహీరోలందరి సరసన కాజల్​ ఆడిపాడింది. వివాదరహితంగా ఉంటూ అందరు యువ హీరోలతో, దర్శకనిర్మాతలతో స్నేహంగా ఉంటూ పలు సినిమాల్లో చాన్స్​ కొట్టేసింది కాజల్​. ఇక ఆమెకు వరస విజయాలు కూడా రావడంతో ఓ దశలో టాలీవుడ్​లో టాప్​ హీరోయిన్​గా ఎదిగింది.

అయితే ముంబైకి చెందిన వ్యాపార వేత్త గౌతమ్​ కిచ్లుతో చాలారోజులుగా సీక్రెట్ గా ప్రేమాయణం కొనసాగించిన కాజల్​ చివరకు అతడినే వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కాజల్​కు అవకాశాలు తగ్గుతాయని.. కేవలం లేడి ఓరియెంటెడ్​ పాత్రలే చేస్తుంనది టాక్​ నడిచింది. అయితే కాజల్​ కు మాత్రం వరసగా అవకాశాలు వస్తున్నాయి.

Also Read: ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నా ఆ స్టార్ హీరోయిన్ ప్రయారిటీ బన్నీనే..!

మంచు విష్ణుతో చెల్లిగా కాజల్​ నటించిన మోసగాళ్లు డిజాస్టర్​గా మిగిలింది. ఇక ప్రస్తుతం ఆచార్యలో నటిస్తోంది. మరో వైపు నాగార్జున అక్కినేని హీరోగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలోనూ కాజల్​కు అవకాశం దక్కింది. ఈ మూవికి ప్రవీణ్​ సత్తారు డైరెక్ట్​ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్​ .. ప్రశాంత్​నీల్​ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్​ మూవిలో కాజల్​ స్పెషల్​ సాంగ్​ చేయబోతున్నట్టు టాక్​.

ఈ పాటలో కాజల్​ అందాల ఆరబోత కూడా ఎక్కువగానే ఉంటుందట. గతంలో జనతా గ్యారేజ్​లో ఓ స్పెషల్​ సాంగ్​ చేసింది కాజల్​. తాను కేవలం జూనియర్​ ఎన్టీఆర్​ కోసం ఈ పాటలో నటించానని.. ఇక ముందెప్పుడు ఐటమ్​ సాంగ్ లో నటించబోనని కాజల్​ చెప్పింది. అయితే ప్రస్తుతం ప్రభాస్​ కోసం కాజల్​ మాట తప్పందని టాక్​ వినిపిస్తోంది. ప్రభాస్​ ఫోర్స్​ చేయడంతో స్పెషల్​ సాంగ్​ చేసేందుకు కాజల్​ ఒప్పుకుందని టాక్​.

Also Read: అయ్యో రకుల్ ఏంటీ పరిస్థితి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -