ఎన్ని సినిమాలు చేతిలో ఉన్నా ఆ స్టార్ హీరోయిన్ ప్రయారిటీ బన్నీనే..!

- Advertisement -

రష్మిక మందన్న తెలుగునాట అతి తక్కువ సినిమాలతోనే స్టార్ స్టేటస్ హోదా సంపాదించిన హీరోయిన్. ఛలో గీత గోవిందం, బ్లాక్ బస్టర్ల తర్వాత ఆమెకి వరుసగా అగ్రహీరోల సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. టాలీవుడ్ లో మహేష్ బాబు తో సహా అందరు హీరోలను ఓ రౌండ్ వేస్తోంది రష్మిక. రష్మిక ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలు చేస్తోంది. తమిళ్ లో అగ్ర విజయ్ సరసన ఓ సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్లో రెండు సినిమాలు చేసేందుకు రష్మిక ఒప్పుకుంది.

అయితే ఈ సినిమాలన్నీ కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయాయి. ఇప్పుడు మెల్లమెల్లగా కరోనా ప్రభావం తగ్గుతుండటంతో అన్ని సినిమాల షూటింగులు ఒకేసారి మొదలవుతున్నాయి. అయితే ఆయా సినిమాల నిర్మాతలు తాజా షెడ్యూళ్లకు డేట్స్ కేటాయించాలని కోరుతున్నారు. అయితే రష్మిక మాత్రం మొదట అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటించేందుకు ప్రయారిటీ ఇస్తోంది.

ఇందులో భాగంగానే అన్ని సినిమాల కంటే ముందుగా పుష్ప సినిమాకు డేట్స్ కేటాయించింది రష్మిక. ఏకంగా నెల రోజుల పాటు బల్క్ డేట్స్ కేటాయించినట్లు టాక్. ఈ నెలరోజుల్లోనే డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. రష్మిక పుష్ప తోపాటు పుష్ప సీక్వెల్ లో కూడా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ పూర్తి చేసి చేసి తిరిగి పుష్ప సీక్వెల్లో నటించనున్నారు.

Also Read

లైగర్​ మార్కెట్​ .. ఈ రేంజ్​లోనా..!

మాస్ట్రో ఓటీటీలో? పాపం నితిన్​ ..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -