ఇద్దరు పెద్ద హీరోలతో శ్రీనువైట్ల మల్టీ స్టారర్​..!

- Advertisement -

తెలుగులో ఎన్నో కమర్షియల్​ హిట్స్​ కొట్టిన శ్రీను వైట్ల ఈ మధ్య డల్​ అయిపోయాడు. ఓ దశలో శ్రీనువైట్ల సినిమాలంటే మినిమం ఎంటర్​ టెయిన్​మెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావించారు. ఇక స్టార్ హీరోలు సైతం శ్రీను వైట్లతో సినిమాలు తీశారు. మహేశ్​బాబు దూకుడు, ఆగడు వంటి చిత్రాలు చేశాడు. ఇక రవితేజకు సైతం వెంకీ, దుబాయ్ శీను లాంటి బ్లాక్​బస్టర్​లు అందించాడు శ్రీనువైట్ల. కామెడీ సీక్వెన్స్​ను ఎంతో వైవిధ్యంగా తెరకెక్కించడం.. టీవీ షోలపై సెటైరిగ్​గా సన్నివేశాలు చిత్రీకరించడం శ్రీను వైట్లకే చెల్లింది. కింగ్​ సినిమాలో బ్రహ్మీ చేసిన జయసూర్య క్యారెక్టర్​ ఇప్పటికే మీమ్స్​ లో వాడుతున్నారంటే దానికి ఉన్న క్రేజ్​ అర్థం చేసుకోవచ్చు.

బ్రహ్మానందం కోసం ఎన్నో వైవిధ్యమైన పాత్రలు సృష్టించాడు శ్రీను వైట్ల. బ్రహ్మి కూడా ఆ పాత్రల్లో ఒదిగిపోయడనుకోండి. ఇదిలా ఉంటే శ్రీను వైట్ల తరహా మూవీస్ ప్రస్తుతం ప్రేక్షకులకు నచ్చడం లేదు. ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఈ రెండు సినిమాలు డిజాస్టర్​గా నిలవడంతో శ్రీను వైట్ల కు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆయన ఢీ సీక్వెల్​ ఢీ అంటే డీ తీస్తున్నాడు. దీంతో పాటు డబుల్స్​ అనే మరో మూవీని కూడా తెరకెక్కించబోతున్నాడు.

- Advertisement -

Also Read: బడా బ్యానర్లన్నీ సంతోష్ శోభన్ చుట్టే..!

అయితే ఈ రెండు సినిమాల మధ్య గ్యాప్​లో ఓ మల్టీ స్టారర్​ను ప్లాన్​ చేస్తున్నాడట శ్రీను వైట్ల. ఈ మూవీలో ఎవరు నటించబోతున్నారు? నిర్మాతలు ఎవరు? తదితర వివరాలు త్వరలో ప్రకటించబోతున్నాడు. అయితే ఢీ అంటే ఢీ సక్సెస్​ అయితే శ్రీను వైట్ల మళ్లీ ఫామ్​లోకి వచ్చే చాన్స్​ ఉంది. ఢీ అంటే ఢీ స్టోరీ చాలా కొత్తగా ఉంటుంది. ఢీకి దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పాడు శ్రీను వైట్ల. ఓ కొత్త కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్టు చెప్పాడు.

Also Read: అలియాభట్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -