Sunday, May 19, 2024
- Advertisement -

కాట‌మ‌రాయుడు.. పెద్ద టార్గెట్ పెట్టుకున్నాడు

- Advertisement -
Katamrayudu Pre Release Business

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడు మూవీని స‌ర్దార్ మూవీతో లాస్ అయిన పంపిణీదారుల‌కు అమ్మేందుకే తీశార‌న్న టాక్ బాగా వినిపిస్తోంది. అయితే ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు  ప్రి రిలీజ్ బిజినెస్ చూస్తుంటే  ఆ రూల్‌ను నిర్మాత శ‌ర‌త్‌మ‌రార్ ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే క‌నిపిస్తోంది.

స‌ర్దార్ బ‌య్య‌ర్ల‌తో సంబంధం లేకుండా కాట‌మ‌రాయుడు సినిమాను వేరే వాళ్ల‌కు భారీ రేట్ల‌కు అమ్మేస్తున్నార‌ట‌. స‌ర్దార్ థియేట్రిక‌ల్ రైట్స్ రూ.87 కోట్ల‌కు అమ్మారు. ఆ మూవీ బాక్సాఫీస్ నుంచి కేవ‌లం రూ. 52 కోట్ల షేర్‌తో స‌రిపెట్టేసింది. అయితే ఇప్పుడు కాట‌మ‌రాయుడు సినిమాను స‌ర్దార్‌తో లాస్ అయిన బ‌య్య‌ర్ల‌కు కాకుండా వేరే వాళ్ల‌కు..అది కూడా ఏకంగా రూ.87 కోట్ల‌కు థియేట్రిక‌ల్ రైట్స్ అమ్మేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి కాట‌మ‌రాయుడు హిట్ అవ్వాలంటే ఏకంగా రూ.90 కోట్ల షేర్ రాబ‌ట్టాలి. గ్రాస్ ఎలాగైనా రూ.120 కోట్లు కొల్ల‌గొట్టాలి. మరి ఈ భారీ టార్గెట్‌ను కాట‌మ‌రాయుడు ఎంత వ‌ర‌కు చేధిస్తాడో చూడాలి. కాట‌మ‌రాయుడు మార్చి చివ‌రి వారంలో విడుదల కానుంది.

{youtube}jEdBrOzmTsM{/youtube}

Related

  1. కాట‌మ‌రాయుడు క‌థ లో సూపర్ ట్విస్టులు ఇవే!
  2. అప్పుడే లీక్ అయిన కాట‌మ‌రాయుడు.. ప‌వ‌న్ సీరియ‌స్‌!
  3. కాట‌మ‌రాయుడు టైటిల్ సాంగ్ లీక్
  4. కాటమరాయుడు పక్కా హిట్.. ఎందుకంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -