Tuesday, April 16, 2024
- Advertisement -

బండి సంజయ్ మత విద్వేషాలు రేపెడుతున్నాడా ?

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో బిజెపి జట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ఇతర పార్టీల నేతలు కూడా అసమ్మతి కారణంగా బీజేపీ వైపు చూస్తూ ఉండడంతో పార్టీ మెల్లమెల్లగా బలం పెంచుకుంటూ కమలనాథులలో సరికొత్త జోష్ నింపుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మూడవ సారి ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామ సమీపంలోని కుందారంలో అర్చకులతో సమావేశం అయిన బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులకు పాల్పడతామని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమరాన్ని రేపుతున్నాయి.

ఇంక ఆయన మాట్లాడుతూ రామాయణం, భగవద్గీత ను కొందరు కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, అర్చకులను, దేవుళ్ళను కించపరచడం మంచి సంస్కృతి కాదని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఇమాన్ లకు ఇచ్చే గౌరవం.. అర్చకులకు ఇవ్వరా ? అంటూ ఆయన ప్రశ్నించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి భగవద్గీతను అవమానిస్తే భౌతిక దాడులకు పాల్పడతామని చెప్పడమే సర్వత్ర చర్చనీయాంశం అవుతోంది.

ఒక పార్టీ అధ్యక్ష హోదాలో ఉన్న ఆయన మత విద్వేషాలు రేకెత్తించే విధంగా బౌతీక దాడులకు పాల్పడతామని చెప్పడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కచ్చితంగా మతవిద్వేషాలకు తావిచ్చినట్టే అంటూ కొందరు అతివాదులు వారి అభిప్రాయాలను చెప్పుకొస్తున్నారు. ఇక బ్రాహ్మణులకు అన్నీ విధాలా తోడుగా ఉంటామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల కాస్త నెగిటివ్ గానే స్పందిస్తున్నారు నెటిజన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -