Tuesday, April 30, 2024
- Advertisement -

మునుగోడు టికెట్ల హోరు.. చిక్కులు మాత్రం ఆ పార్టీకే !

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు కు సంబంధించిన చర్చ ప్రతిరోజు కొత్త రూపు సంతరించుకుంటుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉపఎన్నికలు అనివార్యం కావడంతో గెలుపు కోసం ప్రధాన పార్టీలు గట్టిగానే ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఉపఎన్నిక అన్నీ పార్టీలకు కీలకం కావడంతో మునుగోడుపై గట్టిగానే ఫోకస్ చేస్తున్నాయి. అందువల్ల అభ్యర్థుల విషయంలో వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నాయి ప్రధాన పార్టీలు. అయితే కాంగ్రెస్ కు రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకొనున్న రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరుపు అభ్యర్థి అన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక మునుగోడుపై ఆచితూచి వ్యవహరిస్తున్న అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ కూడా గెలుపు గుర్రానికే టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉందట. ముఖ్యంగా టి‌ఆర్‌ఎస్ తరుపున కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ ఉపఎన్నిక గెలుపు వల్ల టి‌ఆర్‌ఎస్ కు ఒరిగేదిమి లేకున్నా .. ఓడిపోతే మాత్రం వచ్చే ఎన్నికలో పార్టీపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అయినప్పటికి మునుగోడు టి‌ఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం కాకపోవడంతో ఈ ఉపఎన్నికను కే‌సి‌ఆర్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎటొచ్చి సమస్యంతా కాంగ్రెస్ కే ఏర్పడింది. ఎందుకంటే మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో పార్టీ బలం నిలబడాలంటే ఉప ఎన్నికల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.

అంతే కాకుండా ఒకప్పుడు కాంగ్రెస్ కు మునుగోడు స్థానం నుంచి బలమైన నేతగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. బీజేపీ నుంచి ఉప ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అలాగే పార్టీ బలం పెంచుకునేందుకు మునుగోడు ఉపఎన్నిక కాంగ్రెస్ కు అత్యంత కీలకం. ఈ నేపథ్యం కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే కాంగ్రెస్ తరుపున పాల్వాయి స్రవంతి, చెలమల కృష్ణారెడ్డి, పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే గెలుపు గుర్రానికే టికెట్ కట్టబట్టాలని చూస్తున్న కాంగ్రెస్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తుందా ? లేదా వేరే ఇంకెవరినైనా బరిలోకి దించుతుందా ? అనేది చూడాలి.

Also Read :

మోడీ “మోనార్క్” యేనా ?

జగన్ సార్.. డిమాండ్లు విన్నారండోయ్ !

జగన్ను ఓడించాలంటే అదొక్కటే దారి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -