Monday, April 29, 2024
- Advertisement -

రామ్ కోసం విలన్ గా మారనున్న స్టార్ యాక్టర్..?

- Advertisement -

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ హీరోగా మాస్ యాక్షన్ చిత్రం రెడ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ హీరోగా కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు ఓ స్టార్ యాక్టర్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో తను విలన్ గా నటించాలని దర్శకుడు రిక్వెస్ట్ చేయడంతో అందుకు అతను ఓకే చెప్పినట్లు కోలీవుడ్ సమాచారం. ఇంతకీ ఆ యాక్టర్ మరెవరో కాదు ఒకప్పుడు హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో మాధవన్.

Also read:ఫ్యామిలీ మ్యాన్ 2లో అందరిని ఉడికించిన అద్భుత పాత్రలివే!

లింగుస్వామి దర్శకత్వంలో  ‘ర‌న్‌, వేట్టై’ చిత్రాల్లో మాధవన్ హీరోగా చేయడం వల్లే ఆ చనువుతో లింగస్వామి రామ్ హీరోగా తెరకెక్కే సినిమాలో విలన్ పాత్ర చేయమని అడిగినట్లు తెలుస్తోంది. మాధవన్ కి తెలుగు తమిళంలో ఎంతో క్రేజ్ ఉండటంవల్ల అతనిని సంప్రదించారని, ఆ సినిమాలో విలన్ పాత్రలు చేయడం కోసం మాధవన్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఇదివరకే నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి చిత్రంలో మాధవన్ విలన్ గా నటించారు.

Also read:టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో విజయ దేవరకొండనట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -