Friday, March 29, 2024
- Advertisement -

ఫ్యామిలీ మ్యాన్ 2లో అందరిని ఉడికించిన అద్భుత పాత్రలివే!

- Advertisement -

బాలీవుడ్ పాపులర్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్” ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వం వహించారు. తాజాగా వెబ్ సిరీస్ కు సీక్వెల్ గా “ది ఫ్యామిలీ మ్యాన్ 2 ” సిరీస్ జూన్‌ 4న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది.తొలి సీజ‌న్ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి స్పందన రావడంతో దాని సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఇటీవలే “ఫ్యామిలీ మ్యాన్ 2” ట్రైలర్ రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ పై తీవ్రమైన విమర్శలు, వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా మొదటి సీజన్‌లో ప్రేక్షకులను అలరించిన పాత్రలను ఓ సారి పరిశీలిద్దాం. ఇందులో ముఖ్య పాత్ర శ్రీకాంత్‌ తివారి ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే పోలీస్ ఆఫీసర్ గా అద్భుతంగా నటించాడు. ఇక రెండో సీజన్‌లోనూ అదిరిపోయే పంచ్‌లు, యాక్షన్‌ సీన్లతో అలరించేందుకు సిద్ధమైనట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.

Also read:ఆ వివాదం పై సమంత స్పందించక పోవడానికి కారణం అదే!

ఇందులో మరో ముఖ్య పాత్ర శ్రీకాంత్‌ తివారి భార్య సుచిత్రగా ప్రియమణి చక్కగా నటించింది
మధ్య వయస్సు సంక్షోభంతో సతమతమయ్యే స్త్రీగా ప్రియమణి చక్కగా నటించింది. ఇక మరో పాత్ర శ్రీకాంత్‌ స్నేహితుడు జేకే తల్పడే. దాదాపు మొదటి సీజన్‌లో ఎక్కువ సన్నివేశాలు జేకే తల్పడే, శ్రీకాంత్‌ తివారీల మధ్యే ఉన్నాయి. జోయా కూడా శ్రీకాంత్ టీంలోని సభ్యురాలే. ఉగ్రవాదులను హతం చేయడంలో ఆమెదీ చురుకైన పాత్రే. అలాగే సమంత కెరీర్లో మొదటి సారీ “ది ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్లో సమంత ఎల్.టి.టి.ఇ రెబల్ రాజీ పాత్రలో అద్భుతంగా నటించిందట.

Also read: ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్న మూడు సినిమాలు.. ఏవంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -