Friday, April 19, 2024
- Advertisement -

నాగ చైతన్యతో గొడవలు జరుగుతున్నాయ్: సమంత

- Advertisement -

టాలీవుడ్‌ అగ్రనటి సమంత ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తన అందం, అభినయంతో వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో దూసుకు పోతోంది. అలాగే సమంత కెరీర్లో మొదటి సారి నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″. ఈ యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వం వహించారు. ఇటీవలి ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ రిలీజ్ కాగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.”ది ఫ్యామిలీ మ్యాన్ 2 ” సిరీస్ జూన్‌ 4న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది.

సమంతా ఇప్పటి వరకు టాలీవుడ్, కోలీవుడ్ కే పరిమితమైది. “ది ఫ్యామిలీ మ్యాన్ 2″సిరీస్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది.ఈ సందర్భంగా సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న సమంత తాజాగా అభిమానులతో ముచ్చటించి తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది.ప్రతి వ్యక్తికి తన ఇష్టాలేంటో తెలుసుకోవడం చాలా అవసరమని చెప్పిన సమంత. అలాగే తమను తాము ప్రేమించుకున్నప్పుడే జీవితాన్ని ఆనందంగా గడపగలమని చెబుతుంది.ఇక తన భర్త నాగ చైతన్య గురించి మాట్లాడుతూ తమ ఇద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న గొడవలు జరుగుతుంటాయని. అయితే ప్రతిసారి మొదట కాంప్రమైజ్‌ అయ్యేది మాత్రం తానే అంటూ చిలిపిగా చెప్పుకొచ్చింది.

Also read:టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో విజయ దేవరకొండనట!

సమంతా టాలీవుడ్‌లో రాణిస్తూనే, ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభించి బడుగు, బలహీల వర్గాల పిల్లలకు విద్య, వైద్యం అందిస్తూ తన వంతు సామాజిక సేవలను అందిస్తోంది.ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకుంతలం’ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.పాన్ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ సమంతకి జంటగా దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు.

Also read:క్రాక్ టీమ్ ఇచ్చిన సర్ప్రైజ్ చూశారా.. ఎంత బాగుందో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -