Tuesday, April 30, 2024
- Advertisement -

చెర్రీతో మాళవికా మోహనన్​ రొమాన్స్..!

- Advertisement -

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​కు జోడీగా మలయాళ భామ మాళవికా మోహనన్​ ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తమిళ స్టార్​ దర్శకుడు శంకర్​ .. చరణ్​తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఇండియన్​- 2 చిక్కుల్లో ఉన్నారు. ఈ చిత్ర విషయంలో నిర్మాతలతో ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి. ఈ సమస్యలు పరిష్కారం అయితే ఆయన చరణ్​తో ఓ మూవీ చేసే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో కథానాయికగా మాళవికనుఎంపికచేయబోతున్నట్టు టాక్​. పేట చిత్రంతో మాళవికా మోహనన్​ తమిళ తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఇళయ దళపతి విజయ్​ నటించిన మాస్టర్​ సినిమాలో అవకాశం దక్కించుకున్నది. ఈ సినిమా ఓకే అయితే ఆమెకు ఇదే మొదటి సినిమా. అంతకు ముందు ఆమె మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం శంకర్​ డైరెక్షన్​లో నటించే ఛాన్స్​ దక్కించుకుంది.

Also Read: బన్నీతో కలసి మెగాస్టార్ తీన్ మార్ స్టెప్పులు.. ఫ్యాన్స్ కిక పండగే..!

రామ్​ చరణ్​ ప్రస్తుతం ఆర్​ఆర్​ఆర్​ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు చిరంజీవి నటిస్తున్న ఆచార్యలోనూ ఓ రోల్​ చేస్తున్నారు. ఆర్​ఆర్​ఆర్​ షూటింగ్​ పూర్తైన వెంబడే ఆయన శంకర్​ డైరెక్షన్ లో నటించబోతున్నాడు. ఆర్​ఆర్​ఆర్​ విడుదలైతే చరణ్​కు పాన్​ ఇండియా హీరోగా గుర్తింపు దక్కుతుంది. కాబట్టి ఆ తర్వాత శంకర్​తో మూవీ చేసి మార్కెట్​ను విస్తరించుకోవాలని చరణ్​ ప్లాన్​ చేస్తున్నాడట.

Also Read: రెబల్ స్టార్ సినిమాలో రాశి ఖన్నాకు ఛాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -