Friday, April 26, 2024
- Advertisement -

తమిళనాట చిన్నమ్మ ప్రకంపనలు.. నన్ను పార్టీ నుంచి ఎవరూ దూరం చేయలేరు..!

- Advertisement -

తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన శశికళ.. జయలలిత మరణాంతరం సీఎం కుర్చీ మీద కూర్చోవాలని కలలు గన్నారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమె తన అనుచరుడైన పళనిస్వామిని సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టారు. కానీ చివరకు అతడు కూడా ఎదురుతిరిగాడు. ఏకంగా శశికళనే అన్నాడీఎంకే పార్టీ నుంచి సస్పెండ్​ చేసే దాక చేరింది పరిస్థితి.

చివరకు ఆమె గత అసెంబ్లీ ఎన్నికల ముందు జైలు నుంచి విడులయ్యారు. అయినప్పటికీ ఎటువంటి రాజకీయకార్యకలపాలు చేయలేదు. ఓ దశలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీని వెనక బీజేపీ హస్తం ఉన్నట్టు, తెరవెనక ఉండి గేమ్​ ఆడినట్టు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా శశికళ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్​ కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకోబోతున్నదని.. త్వరలోనే ఆపార్టీలో చేరబోతుందని వార్తలు వస్తున్నాయి.

Also Read: ముకుల్​ ఉంటారా? పోతారా? బెంగాల్​ బీజేపీలో టెన్షన్​..!

ఈ మేరకు ఆమె పార్టీ నేతలతో మాట్లాడిన పలు ఫోన్​కాల్స్​ ఆడియోలు కూడా లీక్​ అవుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం అన్నాడీఎంకే నడిపించే నేతలు ఎవరూ లేక.. బలహీనంగా మారిందని..ఆమె వచ్చి పగ్గాలు చేపట్టాలని కొందరు కార్యకర్తలు కోరుతున్నారు. కానీ అన్నాడీఎంకేలో ఓ వర్గం.. పళనిస్వామి, పన్నీరు సెల్వం వీరి అనుచరులు ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారు. శశికళ పార్టీలోకి వస్తే.. ఆమె పార్టీని హస్తగతం చేసుకుంటుందని.. తమకు ప్రాధాన్యం తగ్గుతుందని వారు భావిస్తున్నారు.

ఈ క్రమంలో శశికళ అడుగులు ఎలా ఉంటాయో? ఆమె పార్టీని ఎలా చేతుల్లోకి తీసుకుంటారో? అన్న అంశం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.. మరోవైపు ఇటీవల విడుదలైన కొన్ని ఆడియో సంభాషణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ‘అన్నాడీఎంకే తన ఊపిరి అని, దానిని వేరు చేయడం ఎవరితరం కాదు’ అంటూ తాజాగా శశికళ మాట్లాడిన ఓ ఆడియో బయటకు వచ్చింది. అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆనందన్‌, శివగంగై జిల్లా కారైక్కుకుడి అన్నాడీఎంకే నేత ప్రభాకరన్‌తో ఆమె ఫోన్​లో మాట్లాడారు. దాదాపు ఐదునిమిషాలు వీరి సంభాషణ కొనసాగింది.ఇలా మొత్తం 22 మంది నేతలతో ఆమె మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు శశికళ చర్యలతో అన్నాడీఎంకే నేతల్లో భయం పట్టుకున్నది. ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి రానివ్వకూడదని వారు ఎత్తులు వేస్తున్నారు. ఈపరిణామాల మధ్య ఈనెల 14న అన్నా డీఎంకే నేతలు ఓ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు.ఈ సమావేశానికి కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే అనుమతిచ్చారు. ఈ సమావేశంలో ఏం జరగబోతున్నది అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఎవరైనా శశికళ ప్రస్తావన తీసుకొస్తారా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆమెతో మాట్లాడే నేతలపై అన్నాడీఎంకే నేతలపై దృష్టి సారించారు.

Also Read: యూపీ సీఎం యోగిని మార్చేస్తారా? నిజమెంత?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -