రెబల్ స్టార్ సినిమాలో రాశి ఖన్నాకు ఛాన్స్..!

- Advertisement -

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రాశి ఖన్నా. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తన క్యూట్ లుక్స్ తో యూత్ ని ఫిదా చేసింది ఈ అమ్మడు. రాశి ఖన్నా తొలి సినిమా చూసిన వాళ్లు కచ్చితంగా ఈమె మంచి పొజిషన్ కు చేరుకుంటుందని అంతా భావించారు. కానీ ఎందుకో అనుకున్నంత రేంజ్ కి ఆమె వెళ్లలేకపోయింది. దాదాపు యువ హీరోలందరి పక్కన నటించినా రాశి ఖన్నా ఎందుకో సక్సెస్ అందుకోలేకపోయింది.

మూడేళ్ల కిందట విడుదలైన తొలి ప్రేమ సినిమాతో మళ్లీ ఆమె జోరు అందుకుంటుందని అనుకున్నా అలా ఏమీ జరగలేదు. అయితే సినిమా విజయాపజయాలతో సంబంధం లేకుండా రాశి ఖన్నాకు ఆఫర్లు మాత్రం వస్తున్నాయి. ఇప్పుడు ఆమెకు తెలుగుతో పాటు తమిళ్, హిందీ లో పలు ఆఫర్లు చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్ వచ్చింది.

- Advertisement -

Also Read: #PSPK28 పవర్ స్టార్ కి జోడిగా సామ్..!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సలార్, ఆది పురుష్ సినిమాలు పూర్తయిన తర్వాత ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ కూడా ఓ ప్రధానమైన పాత్రలో నటిస్తున్నాడు. అయితే అందులో ఓ కీలకమైన పాత్రకు రాశిఖన్నా ను ఎంపిక చేసినట్లు తెలిసింది. హీరోయిన్ పాత్ర కాకపోయినా మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో ఆమె కూడా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ప్రభాస్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతుంది కాబట్టి ఈసారైనా రాశి ఖన్నా ఫేట్ మారుతుందేమో చూడాలి.

Also Read: వేణు శ్రీరామ్ తర్వాతి ప్రాజెక్ట్​ ఇదే?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -