Wednesday, May 15, 2024
- Advertisement -

గ్యారేజ్ ట్రైల‌ర్‌ కు ఫిదా అయిన మెగా హీరో!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ సినిమా ఆడియో తో పాటు ట్రైల‌ర్‌ కు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైల‌ర్‌ యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఎక్క‌డ చూసినా జ‌న‌తా గ్యారేజ్ పాట‌లే విన‌ప‌డుతున్నాయి. ఇక అభిమానులు గ్యారేజ్ ట్రైల‌ర్‌ను ప‌దే ప‌దే చూస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ సినిమాని కొత్తగా తీస్తున్నాడు అని కొరటాల శివని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం కూడా అద్భుతంగా ఉంది. సెల‌బ్రిటీలు కూడా గ్యారేజ్ ట్రైల‌ర్‌ను ప్ర‌శంసిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నందమూరి హీరో ఎన్టీఆర్‌ని ప్రశంశలతో ముంచెత్తాడు. ఇప్పుడే ట్రైలర్ చూశానని… కొరటాల శివ వర్క్ అద్భుతంగా ఉందని చెప్పాడు. అమేజింగ్ ట్రైలర్ అని ట్వీట్ చేశాడు.

సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్ట‌రైజేష‌న్ డిజైన్ చేయ‌డంలో కొర‌టాల సూప‌ర్ అని చెప్పాడు. ఇక ఎన్టీఆర్ పెర్పామెన్స్ ఎప్పుడూ బాగుంటుంద‌ని చెప్పాడు. ఇక టాలీవుడ్‌లో ఉత్త‌ర‌, ద‌క్షిణ ధృవాలుగా ఉండే నంద‌మూరి, మెగా ఫ్యామిలీల‌కు చెందిన హీరోలు ఇలా ప్ర‌శంసించుకోవ‌డం మ‌ల్టీస్టార‌ర్ మూవీల‌కు రెడీ అవ్వ‌డం మెచ్చుకోద‌గ్గ విష‌య‌మే. ఇప్ప‌టికే క‌ళ్యాణ్‌-సాయి మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు రెడీ అవుతుండ‌గా… ఇప్పుడు వ‌రుణ్ ఎన్టీఆర్ ట్రైల‌ర్‌ను మెచ్చుకోవ‌డం విశేషం. ఈ విష‌యంలో వ‌రుణ్‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందించాలి.

{youtube}v=7O4Hm070Bc8{/youtube}

Related

  1. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మోహన్‌లాల్‌ సారీ చెప్పాడు! ఎందుకో తెలుసా?
  2. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  3. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  4. మెగా స్టార్ మేనల్లుడ్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -