Friday, March 29, 2024
- Advertisement -

అయ్యా… మెగా స్టార్ ఇదేంటి. నీకింకో డైరెక్టరే దొరకలేదా..!!

- Advertisement -

ప్రస్తుతం కొరటాల శివ తో ఆచార్య అనే సినిమా చేయబోతున్న మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమా తర్వాత లూసిఫర్ అనే మలయాళ సినిమా కి రీమేక్ చేయబోతున్నారు.. ఆ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం అందించబోతున్నారు.. ఇక ఈ సినిమా తర్వాత చిరు మెహర్ రమేష్ తో ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి.. తమిళ రిమెక్ చిత్రాన్ని రమేష్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ అజిత్ నటించిన చిత్రం వేదాళం. దీనినే మెగాస్టార్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. కానీ తెలుగుకు తగ్గట్టుగా స్ర్కిప్ట్ ను సరిచేసే బాధ్యతలు మెహర్ రమేష్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. వేదాళం చిత్రం తమిళంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఎప్పటి నుంచో ఈ చిత్రం చేయాలని చిరు భావించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మోహర్ రమేష్ దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న చిత్రాలు అసలు ఏమీ లేవు. కానీ రమేష్ రచయిత, దర్శకుడు, నటుడిగా మనకు తెలుసు. 2002 మహేష్ బాబు నటించిన బాబి చిత్రంలో స్నేహితుడి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత కన్నడ సినీ పరిశ్రమంలో పునీత్ రాజ్ కుమార్ తో సినిమా తీశారు. జూనియర్ ఎన్టీఆర్ తో 2011లో శక్తి సినిమాను చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. నిరుత్సాహం చెందకుండా మంచి ఊపుతో 2013లో విక్టరీ వెంకటేశ్ ను డైరెక్టు చేశారు మెహర్. ఇది కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక డైరెక్షన్ చేసి దాదాపుగా ఏడేళ్లు అవుతుంది. ఇంత వరకు ఒక్క సినిమాకు కూడా డైరెక్టర్ గా ఒప్పుకోలేదు. కానీ అనూహ్యంగా మెగా కంపౌండ్లో ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే సినీ జనాలు, మెగా ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ తో తీసిన బిల్లా సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నది.

మరి మెగాస్టార్ చిరంజీవి ఖైదీనెంబర్ 150, సైరా నరసింహారెడ్డి చిత్రాల విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా కొరటాల శివ డైరెక్టు చేస్తున్న చిత్రం ఆచార్యలో నటిస్తున్నారు. చిరు బర్త్ డే నాడు చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ కూడా చేశారు. మరి కెరియర్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న చిరుకు డైరెక్షన్ చేసే అవకాశం దొరికిందంటే రమేష్ కు ఎక్కడో లక్కు రాసిపెట్టి ఉన్నట్లేనని భావిస్తున్నారు. తాజా సమాచారం ఏమిటంటే స్క్రిప్ట్ కు మూడు సంవత్సరాల సమయం తీసుకోనున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

అప్పుడు త్రివిక్రమ్, ఇప్పుడు సుకుమార్.. పుష్ప సినిమా కాపీనా..!!

బాలీవుడ్ స్టార్ హీరోలకే షాక్ ఇస్తున్న ప్రభాస్..!

సురేఖ వాణి కూతురు అప్పుడే తల్లైంది..!

హీరోయిన్ రాశీ కన్నుకు ఏమైంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -