Saturday, May 4, 2024
- Advertisement -

బ్లాక్ మనీని ఏం చేయాలో అర్ధంకాక టాప్ హీరో విలవిల

- Advertisement -
modi effect on unkonwn star hero

ప్రధాని మోదీ నోట్ల కట్ల రద్దు వ్యవహారం తెలుగులోని ఓ స్టార్ హీరో కు పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టినట్లైంది. పాతిక కోట్లకు పైగా క్యాష్ ఆయన ద్గగర బ్లాక్ మనీ ..ఇప్పుడు ఏం చేయాలో అని తలపట్టుకున్నారట. నిన్నటి నుంచి షూటింగ్ కు కూడా హాజరు కాకుండా ఆయన తన వాళ్లతో మంతనాలు జరుపుతున్నారట. వాస్తవానికి మన తెలుగులో కాదు దేశంలోని అన్ని లాంగ్వేజ్ ల్లోనూ చాలా మంది హీరోలు బ్లాక్ ఇంత, వైట్ ఇంత అని రెమ్యునేషన్ ని తీసుకుంటూంటారు.

నిర్మాతలకు అదే వెసులు బాటుకావటంతో బ్లాక్ మనీ విచ్చలవిడిగా పరిశ్రమలో తిరిగుతూంటుంది. ఆ డబ్బు అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ రియల్ ఎస్టేట్ రంగంలోకి అందులోంచి మళ్లీ సినీ పరిశ్రమలోకి వస్తుంది. దాంతో చాలా మంది హీరోల వద్ద బ్లాక్ మనీ అనేది కామన్. ఇక ప్రస్తుత విషయానికి వస్తే…ఆ స్టార్ హీరో దగ్గర ఓ రియల్ ఎస్టేట్ డీల్ కోసం దాచిన పాతిక కోట్లు ..దాదాపు అన్ని వెయ్యి రూపాయల నోట్లు డినామినేషన్ తో ఉన్నాయిట ఇంట్లో.

ఓ రెండు రోజుల్లో షంషాబాద్ వద్ద ఓ సెటిల్మెంట్ కోసం తెచ్చిన డబ్బు…ఇప్పుడు ఏం చేయాలా అనే సమస్యలో పడేసిందిట. లెక్క చెప్దాము అంటే…దానికి లెక్కలు లేవు. అది బ్లాక్ మనీట. ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం అవుతోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే..ఆయన బయిట వారితో మీడియావారితో మాత్రం మోదీ తెచ్చిన ఈ మార్పు అద్బుతమని పొగుడుతూమాట్లాడుతున్నారట. లోపల ఏడుస్తూ..బయిటకు నవ్వుతూ ఇలా ఆ స్టార్ హీరో నిన్నటినుంచీ నటిస్తున్నాడట.

Related

  1. తెలుగు స్టార్ హీరోల‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మోడీ!
  2. మీ ఫేవరెట్ హీరోలు వాడే లగ్జరీ కార్ల గురించి తెలుసా..?
  3. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల సరదా తీరుస్తున్న టాలీవుడ్ స్టార్ హీరో!
  4. పెళ్లి కాకుండా త‌ల్లి అయిన టాప్ హీరోయిన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -