- Advertisement -

మోడీ ఎఫెక్ట్ మంచు ఫ్యామిలీపై గ‌ట్టిగానే పడింది!

- Advertisement -
modi shock to manchu family

ప్రధాని నరేంద్రమోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణ‌యం రాత్రికి రాత్రే తీసుకోవడంతో.. దేశ వ్యాప్తంగా ఎంతోమంది బ‌డాబాబుల‌కు షాక్ తగిలింది. బ‌డాబాబుల‌కే కాకుండా సామ‌న్యుల‌కు కూడా క‌ష్టాలు తప్పట్లేవు. బ‌డాబాబులు త‌మ వ‌ద్ద ఉన్న బ్లాక్‌మ‌నీనీ ఎలా వైట్ చేసుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంటే… సామాన్యులు త‌మ వ‌ద్ద ఉన్న కొద్ది పాటి పాత నోట్లు మార‌క వాటికోసం ప‌నులు మానుకుని మ‌రీ క్యూలో నుంచోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

అయితే మోడీ నిర్ణ‌యంపై కొంత వ్య‌తిరేక‌త దేశ‌వ్యాప్తంగా వస్తోంది. ఇదిలా ఉంటే మోడీ డెసిష‌న్ టాలీవుడ్ అగ్ర హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మంచు మోహ‌న్‌బాబు ఫ్యామిలీపై గ‌ట్టిగా ప‌డింద‌న్న టాక్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. మంచు ఫ్యామిలీకి హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల ప‌లు వెంచ‌ర్లు ఉన్నాయి. వాటి బిజినెస్ నోట్ల ర‌ద్దుతో బాగా డ‌ల్ అయిన‌ట్టు తెలుస్తోంది.

దాదాపువీటి విలువ 30 శాతం వ‌ర‌కు తగ్గినట్లు తెలుస్తోంది.  ఇక విష్ణు ప్ర‌స్తుతం న‌టిస్తోన్న ‘లక్కున్నోడు’ చిత్రానికి కూడా ఈ పాత నోట్ల రద్దు ఎఫెక్ట్ బాగానే పడిందట. షూటింగ్ కంప్లీట్ అయినా చివ‌రి స‌న్నివేశాల షూటింగ్ కోసం నోట్ల ఎఫెక్ట్ గ‌ట్టిగానే ప‌డింద‌ట‌. దీంతో ల‌క్కున్నోడు సినిమాకి ప్ర‌స్తుతం బ్రేకులు పడ్డాయట. సో మొత్తానికి మోడీ ఎఫెక్ట్ మంచు ఫ్యామిలీపై గ‌ట్టిగానే ప‌డింద‌న్న టాక్ పరిశ్రమలో జోరుగా వినిపిస్తోంది.

Related

  1. రాజమౌళి కి మంచులక్ష్మి కి మధ్య ఏం జరిగింది?
  2. మంచు లక్ష్మి గురించి ఎవరికి తెలియాని నిజాలు!
  3. మెగాస్టార్ తో స్టెప్పులేసిన మంచు ల‌క్ష్మి!
  4. మెగా హీరో కి సటైర్ వేసిన మంచు లక్ష్మి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -