Friday, May 10, 2024
- Advertisement -

మంచు లక్ష్మి గురించి ఎవరికి తెలియాని నిజాలు!

- Advertisement -

యాంకర్ గా టీవీ లో అందరిని కట్టిపడేస్తుంది. సినిమాలో అద్భుతంగా నటిస్తోంది. నిర్మాతగా మంచి చిత్రాలను నిర్మిస్తుంది… మంచు లక్ష్మి ప్రసన్న. వెండితెర, బుల్లి తెరపై అనేక ప్రయోగాలకు నాంది పలికింది… విజయాన్ని అందుకుంది. ఈ అందాల భామ (అక్టోబర్ 8) పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి గురించి మీకు తెలియని విషయాలు..

* డైలాగ్ కింగ్ మోహన్ బాబు, విద్య దేవిల ఏకైక కుమార్తె లక్ష్మి ప్రసన్న. ఈమె 1970 అక్టోబరు 8 న జన్మించింది. 

* లక్ష్మి హైదరాబాద్ లోని సెంట్ ఫ్రాన్సిస్ కాలేజీలో చదువుకుంది. అక్కడే క్లాస్ మేట్ ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి విడాకులు తీసుకుంది.

* అమెరికా వెళ్లిన లక్ష్మి అక్కడే అనేక కంపెనీల్లో పనిచేసి ఎవరిపై ఆధారపడకుండా జీవించేది. ఆ సమయంలో పరిచయమైన ప్రవాస భారతీయుడు ఆండీ శ్రీనివాసన్ ప్రేమించి పెళ్లిచేసుకుంది.

* విదేశాల్లో సరోగసీ ద్వారా పిల్లలు జన్మనివ్వడం సర్వ సాధారణం. ఆ సంస్కృతిని మంచు లక్ష్మి తెలుగు వారికి పరిచయం చేసింది. టాలీవుడ్ సెలబ్రిటీల్లో తొలి సారిగా సరోగసీ పద్ధతిలో తల్లి అయి ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాసన్ దంపతుల ముద్దుల కూతురి పేరు విద్య నిర్వాణ.

* హాలీవుడ్ చిత్రాల ద్వారా వెండితెరకు పరిచయమైన మంచు లక్ష్మి “అనగనగా ఓ ధీరుడు” సినిమాతో తెలుగు తెరపై విలనిజం చూపించింది. ఇందులోని నటనకు గాను ఆమె ఉత్తమ విలన్ గా నంది పురస్కారం అందుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా గుండెల్లో గోదారి, దొంగాటలో నటించి మెప్పించింది.

* తండ్రి మోహన్ బాబు నెలకొల్పిన నిర్మాణ సంస్థ ఉన్నా, తానేమిటో నిరూపించుకోవాలని మంచు ఎంటర్టైన్ మెంట్ సంస్థను మంచు లక్ష్మి స్థాపించింది. గుండెల్లో గోదారి, దొంగాట సినిమాలు నిర్మించి, విజయాలను సొంతం చేసుకుని తండ్రి తగ్గ కూతురనిపించుకుంది.

* మంచు లక్ష్మి బుల్లి తెరపైన పలు షోలు నిర్మించింది. కొన్నింటికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. లక్ష్మి టాక్ షో, ప్రేమతో మీ లక్ష్మి, దూసుకెళ్తా వంటి కార్యక్రమాలు బాగా ఫేమస్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె “మేము సైతం” అనే షో ద్వారా కష్టాల్లో ఉన్న వారికి చేయూతనందిస్తోంది.

* నటిగా, నిర్మాతగానే కాకుండా గాయనిగా మంచులక్ష్మి తన ప్రతిభను చాటుకుంది. దొంగాట సినిమా లో “ఏందిరో” అనే పాటకు గాను గామా అవార్డ్స్ లో బెస్ట్ సెలబ్రిటీ సింగర్ అవార్డు ని అందుకుంది.

* వ్యక్తిగతంగా, వృత్తిపరమైన ఎన్ని ఒత్తిడులు ఉన్నా మంచి లక్ష్మి ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. నిత్యం యోగాతో పాటు ఎక్సర్ సైజ్ చేస్తుంది. అందుకే ఆమెకు నలభై ఆరేళ్లు అంటే ఎవరూ నమ్మరు.

* మంచు లక్ష్మి మంచి భోజన ప్రియురాలు. ఆ ఇష్టంతోటే భర్తతో కలిసి ‘జూనియ‌ర్ కుప్ప‌న్న‌’ పేరుతో హైద‌రాబాద్ లోని హైటెక్ సిటీలో ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రారంభించింది.

Related

  1. ఐ లవ్ యూ ఎలా చెప్పలో అల్లూ శిరీష్ కి నేర్పించిన మంచు లక్ష్మి
  2. మెగాస్టార్ తో స్టెప్పులేసిన మంచు ల‌క్ష్మి!
  3. మెగా హీరో కి సటైర్ వేసిన మంచు లక్ష్మి!
  4. ఒకేసారి ఇద్దరితో డేటింగ్ – పద్మాలక్ష్మి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -