Friday, May 17, 2024
- Advertisement -

అనుష్క పెళ్లిపై కొత్త న్యూస్.. ఎవరితో తెలుసా?

- Advertisement -
Tollywood Heroine Anushka Marriage

టాలీవుడ్ అనుష్క కు మంచి క్రేజ్ ఉంది. ఈ భామకు హీరోలతో సమానంగా అభిమానులు ఉన్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోబుతుంది అనే వార్తలు కొద్ది రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే అనుష్క ప్రస్తుతం ఏ సినిమాలు ఒప్పుకోవడం లేదు.

ప్రస్తుతం చేతిలో ఉన్న సింగం3, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉంది ఈ భామ. ఓం నమో వెంకటేశాయలో గెస్ట్ రోల్ కూడా ఫినిష్ చేసేసింది. ఇక భాగమతి షూటింగ్ కూడా శరవేగంగానే పూర్తి చేసేయనున్నారు. అన్నీ అయిపోయాక.. ఇక అనుష్క పెళ్లి చేసేసుకుంటుందని.. అందుకే కొత్త సినిమాలకు ఒప్పుకోవడం లేదని ఇప్పటికే టాక్ ఉంది.

అనుష్కకు సంబంధాలు చూస్తున్నారనే మాట ముందు నుంచి వినిపిస్తున్నా.. ఓ పెద్ద వయసున్న బిజినెస్ మ్యాన్ తో పెళ్లి అనే రూమర్స్ గతంలో వచ్చాయి. ఇలాంటి వాటిపై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఇప్పుడు స్వీటీని ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ కి ఇచ్చి పెళ్లి చేయనున్నారని గుసగుసలాడుకుంటున్నారు. బెంగళూరు బేస్డ్ గా రియాల్టీ వ్యాపారాలు నిర్వహించే ఈయన.. అనుష్క కుటుంబానికి చాలా కాలంగా స్నేహితుడట. 35 ఏళ్ల ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసుకుని.. సినిమాలకు గుడ్ బై చెప్పేయడం ఖాయమే అంటున్నారు ఫిలిం నగర్ జనాలు. అదే జరిగితే మాత్రం.. టాలీవుడ్ ఓ అరుంధతిని మిస్ అయినట్లే.

Related

  1. అనుష్క ను ఎవరు మోసం చేశారో తెలుసా?
  2. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!
  3. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  4. అనుష్కను బాధపెడుతున్న తమన్నా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -