Friday, May 3, 2024
- Advertisement -

అఖిల్ వల్ల.. ఇబ్బందుల్లో పడ్డ చైతు, సమంత

- Advertisement -
Naga Chaitanya And Samantha in Trouble

అక్కినేని హీరోల మూవీస్ లోనే కాదు.. నిజ జీవితంలో కూడా ఉహించని ట్విస్టులు ఇస్తున్నారు. కింగ్ నాగార్జున తన పెద్దకొడుకు నాగచైతన్యను పక్కన పెట్టి.. చిన్న కొడుకు అఖిల్ కి డిసెంబర్ 9 న నిశ్చితార్థం చేశారు. యూరప్ లో పెళ్లి జరుగుతుందని ప్రకటించారు.

పెళ్లి కి రాబోయే అతిధులకు టికెట్స్ కూడా బుక్ చేశారు. కాని అఖిల్, శ్రీయా ల పెళ్లి విషయంలో గందరగోళం నెలకొని ఉంది. తమ్ముడి పెళ్లి నిర్ణయం వాయిదా పడడంతో అన్నకి చిక్కులు తెచ్చిపెట్టింది. నాగ చైతన్య, సమంతల నిశ్చితార్థం జనవరి 29న ఘనంగా జరిగింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో వీరి పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలని చూస్తున్నారు. అఖిల్ పెళ్లి సంగతి మరిచిపోవాలంటే తొందరగా ఇంట్లో శుభకార్యం జరిగితే బాగుంటుందని నాగ చైతన్యను తొందరగా పెళ్లిచేసుకోమని అక్కినేని నాగార్జున కోరినట్లు తెలిసింది.

ఎంత తొందరగా జరిగితే అంత మంచిదని చైతూని అడగడంతో.. అతను ఆలోచనలో పడ్డాడు. ప్రేమికులుగా మరికొంతకాలం సరదాగా గడుపుదామని అనుకున్న ఈ ప్రేమ పక్షులకు నాగ్ మాటలు ఇబ్బందుల్లో పడేశాయి. ముందుగా పెళ్లి చేసుకుందామా? వద్దా? అని సమంత, చైతు ఆలోచిస్తున్నారు. త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

{youtube}OUmppDmM8oI{/youtube}

Related

  1. అఖిల్‌కు మైండ్‌ పనిచేయడం లేదా? నాగ్ కి పెద్ద సమస్య‌గా మారాడు..?
  2. నాగార్జునకు అఖిల్ తలనొప్పిగా మారాడు.. అసలు ఏం జరిగింది..?
  3. భేదాభిప్రాయాలు వల్ల అఖిల్, శ్రియా ల పెళ్లి ఆగిపోయింది
  4. అఖిల్ పై ఘోరమైన కామెంట్స్ చేసిన బాలయ్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -