Friday, March 29, 2024
- Advertisement -

నెగటివ్‌ రోల్‌లో నాగ చైతన్య

- Advertisement -

టాలీవుడ్ గుడ్ బాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని నాగచైతన్య.. నెగటివ్ రోల్ చేయబోతున్నాడంటూ టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల బంగార్రాజు చిత్రంలో నాగార్జునతో కలిసి నటించి నాగచైతన్య హిట్‌ కొట్టాడు. వరుస సినిమాలతో ప్రస్తుతం చైతూ జోరుమీదున్నాడు. బాలీవుడ్‌ మిస్టర్ పర్​ఫెక్ట్​ అమీర్ ఖాన్​తో లాల్​ సింగ్​ చద్దా సినిమాలో నాగా చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తుండగా.. అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. లాల్‌ సింగ్ చద్దా చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇదిలా ఉంటే.. త్వరలో చైతూ ఓటీటీలోకి.. ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌లో కనిపించబోతున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా నాగ చైతన్య ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‌లో చైతూ జర్నలిస్ట్​గా, నెగెటివ్​ పాత్రలో చేస్తున్నట్లు సమాచారం.

అందులో చైతన్య మేకోవర్​ కూడా విభిన్నంగా ఉంటుందని టాక్​. మొత్తం మూడు సీజన్​లుగా ఈ వెబ్ సిరీస్​ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సీజన్​లో 8 నుంచి 10 ఎపిసోడ్స్​ ఉంటాయని సమాచారం. అంతేకాదు ఇది టైమ్‌ ట్రావెల్ స్టోరీ అన్న గాచిఫ్స్ వినిపిస్తున్నాయి. ఈ వెబ్​ సిరీస్​ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇదే కనుక నిజమైతే.. చైతూకు మంచి ఛాలెంజింగ్ పాత్ర దొరికినట్లే. ఎప్పుడూ ప్రయోగాలకు సై అనే చైతూ.. ఈ వెబ్‌ సిరీస్‌లో జర్నలిస్టు పాత్రలో… అదీ నెగటివ్ రోల్‌లో ఎలా అలరిస్తాడో వేచి చూడాలి మరి.

Also Read

విజ‌య్ షాకింగ్ రెమ్యూన‌రేష‌న్

మ‌రో సీక్వెల్ కు సిద్ధ‌మ‌వుతున్న డార్లింగ్

మంచి ప‌ని చేయ‌బోతే.. రాజ‌మౌళికి ఎదురైన ట్రోల్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -