Friday, April 19, 2024
- Advertisement -

సమ్మర్ కే తొడ కొడతానంటున్న బాలయ్య బాబు..!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ గత కొన్ని సినిమాలుగా ప్రేకహ్స్కులను ఏమాత్రం మెప్పించలేదనే చెప్పాలి.. ఎన్టీఆర్ రెండు పార్ట్ లు, రూలర్ సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.. దాంతో మళ్ళీ తనకు అచ్చోచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేతులు కలిపాడు బాలయ్య.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.. త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ రాగ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది..

ఇక బిబి3 వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. సింహ, లెజెండ్ లాంటి సినిమా ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.దీనికి తగ్గట్టే BB3 ఫస్ట్ రోర్ పేరుతో విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ అదరగొట్టింది. ఇందులో పంచెకట్టులో మీసం మెలితిప్పుతూ మాస్ లుక్ లో బాలయ్య అలరించాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర.. రెండోది ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని సమాచారం.

ఇక ఈ సినిమా మొదలయిన దగ్గరినుంచి అనేక రూమర్లు వచ్చాయి.. బోయపాటి ఈ సినిమా చేయట్లేదని, బాలకృష్ణ స్టొరీ కి ఒప్పుకోలేదని చాలా గాసిప్స్ వచ్చాయి.. కానీ ఎట్టకేలకు సినిమా షూటింగ్ కి వెళ్ళింది.. అటు బోయపాటి కి కూడా ఈ సినిమా ముఖ్యం కావడంతో అందరి ద్రుష్టి హిట్ పైనే పట్టారు. ఇక కరోనా తర్వాత ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు.. దాంతో అనుకున్నట్లు గా సమ్మర్ లో సినిమా రిలీజ్ అవుతుందా అని అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..అయితే  ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను సమ్మర్ కి విడుదల చేస్తామని డిస్ట్రిబ్యూటర్లకి మేకర్స్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సమ్మర్ కి కరోనా పరిస్థితుల పూర్తిగా సర్దుమణిగే అవకాశం ఉండటంతో అప్పుడే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచిదని భావిస్తున్నారట..

సోలో బ్రతుకు కు ఇంతకంటే బెటర్ ఆలోచన రాలేదా..?

రవితేజ నక్కిన ని పక్కన పెట్టాడా.. ఇప్పుడెలా.?

విజయ్ తోనే మళ్ళీ మురుగదాస్.. ఏంటి బాసు ఇది..?

ఈ విజయ్ సినిమా వెనుక అల్లు అర్జున్ హస్తం ఉందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -