Sunday, April 28, 2024
- Advertisement -

టీఆర్ఎస్ అంతకుమించి ప్లాన్ చేసిందా..?

- Advertisement -

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత భారీ మెజర్టీ తో గెలిచిన సంగతి తెలిసిందే.. తెలంగాణ గులాబీ పార్టీ పని అయిపోయిందన్న వారికి ఇదో పెద్ద దెబ్బ అని చెప్పాలి.. రానున్న దుబ్బాక, గ్రేటర్ , ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ ఎన్నిక మంచి బలం అవుతుందని చెప్పనవసరం లేదు.. అయితే తెరాస పార్టీ కి ఇక్కడ గెలుపు పై ధీమా మొదటినుంచి ఉండగా ఇక్కడ కేవలం గెలుపుకోసమే పార్టీ బరిలోకి దిగలేదు అని తెలుస్తుంది.. పోలైన మొత్తం 823 ఓట్లలో 728 ఓట్లు కవితే దక్కాయి. కాంగ్రెస్, బీజేపీలకు కలిపి వంద ఓట్లు కూడా రాలేదు.

టీఆర్ఎస్ అసలు బలం 505 మంది మాత్రమే. కానీ ఓట్లు మాత్రం 123 ఎక్కువ వచ్చాయి. దాంతో కవిత అక్కడ చేసిన పనితనం కనిపిస్తుంది.. ఓడిపోయినా కోపం ప్రదర్శించకుండా అక్కడి వారి తో ఆమె మంచి గా మెలిగి మళ్ళీ గెలుపు సాధించింది. ఇక ముందే చెప్పినట్లు గెలుపు ముందే డిసైడ్ అయినా తెరాస పార్టీ కి అంతకుమించి ప్రతిపక్షాలకు ఎదో చెప్పాలని చూశారట.. వాస్తవానికి ఈ ఎన్నికలకు ముందు తెరాస కి కొంత ప్రజల్లో వ్యతిరేఖ ఉందని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేశాయి..

దానికి తోడు ఎంపీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన కవిత ను నిలబెట్టడంతో విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి.. అయితే ఆమె గెలిచి వారికి బుద్ధి చెప్పాలని కేసీఆర్ తో సహా పార్టీ క్యాడర్ అంతా డిసైడ్ అయ్యిందట.. ప్రజల్లో తమకు ఉన్న వ్యతిరేకత ను కూడా తుడిచేయాలని అనుకున్నారట.. అంతేకాదు ఎంపీ ఎన్నిక‌లో ఓట‌మి పాలైన క‌వితను అత్య‌ధిక మెజార్టీతో గెలిపించుకుని టీఆర్ఎస్ త‌న ప‌గ‌తీర్చుకుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ఎన్నిక‌లో అభ్యర్థులకు డిపాజిట్లు దక్కాలంటే మొత్తం పోలైన ఓట్లలో ఆరోవంతు ఓట్లు రావాలి. మొత్తం 823 ఓట్లలో ఆరోవంతు అంటే 138 మొదటి ప్రాధాన్యత ఓట్లు రావాల్సి ఉంటుంది. కానీ, బీజేపీకి 56, కాంగ్రెస్‌కు 29 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. రెండు పార్టీల అభ్యర్థులకు కలిపినా డిపాజిట్లు దక్కేలా ఓట్లు రాకపోవడం గమనార్హం. ఈ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు స్పష్టమైంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి గెలిచిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితకు ఓట్లేయడం గమనార్హం.

దుబ్బాక లో టీఅరెస్ గెలుపు ఖాయం..

దుబ్బాక లో ఎవరి బలం ఎంత..?

హరీష్ రావు రెండు కళ్ళ సిద్ధాంతం

కేసిఆర్ దుబ్బాక లో ఈ రేంజ్ లో ప్లాన్ చేశారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -