Sunday, April 28, 2024
- Advertisement -

ఆ నిర్మాణంలో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. దర్శకుడు అతడే?

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ నేడు తన 61వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు గతంలో వినిపించాయి.తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా వీరి కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించిన ఓ వీడియోను మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తాను తీయబోయే సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేయడంతో నందమూరి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఈ ఏడాది సినీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలుస్తోంది. గతంలో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలుజోరుగా వినిపించినప్పటికీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు.

Also read:ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమాలో ఎంట్రీ ఇవ్వడానికి డాన్స్ లతో పాటు తన శరీర ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి సినిమా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.మోక్షజ్ఞ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఉండనుందని సమాచారం వినిపిస్తోంది. బుచ్చిబాబు తన రెండవ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. చూడాలి మరి బాలకృష్ణ కొడుకును ఈ ఏడాదైనా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారో ?లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Also read:రంగం హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -