Saturday, April 20, 2024
- Advertisement -

ప్రకాశ్ జవదేకర్, షెకావత్ లతో సీఎం జగన్ భేటీ!

- Advertisement -

రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ స్వాగతం పలికారు. సీఎం జగన్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే మంత్రి పియూష్ గోయల్ తదితరులను కలవనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మొదట సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తోనూ, ఆపై జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తోనూ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సవంబంధించిన పలు కీలక అంశాలు వారితో చర్చించారు సీఎం జగన్. ఇక ముఖ్యమంత్రి జగన్ కాసేపట్లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ను కలవనున్నారు.

ఇక సీఎం జగన్ వెంట ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, బాలశౌరి, సత్యనారాయణ, భరత్, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, గురుమూర్తి తదితరులు ఉన్నారు. ఈ రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు.

బతుకుతాం అనే ఆశ లేదు.. హంసానందిని!

జగ్గుభాయ్​.. బాలీవుడ్​ పయనం..!

సూర్య గొప్ప మనసు.. ఫ్యాన్స్​కు ఆర్థిక సాయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -