Thursday, March 28, 2024
- Advertisement -

పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలని వైఎస్ షర్మిల పిలుపు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ కోసం ఎంతో చేశారని.. ఆయన మరణం తర్వాత మళ్లీ తెలంగాణలో రాజన్న రాజ్యాన్నితీసుకు వచ్చేందుకు తాను అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతానని ఆయన కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే తెలంగాణ సర్కార్ పై తనదైన విమర్శనాస్త్రాలు సందిస్తూ వస్తున్నారు. ఇటీవల నిరుద్యోగుల గురించి 72 గంటల పాటు నిరాహార దీక్షచేశారు.

ఇక వైఎస్ షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీ పేరు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీగా దాదాపు ఖరారైంది. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియలన్నీ పూర్తయ్యాయని ఇప్ప‌టికే ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త వాడుక రాజగోపాల్ ప్ర‌క‌ట‌న కూడా చేశారు. రాజశేఖర్‌రెడ్డి జయంతి సంద‌ర్భంగా జులై 8వ తేదీన పార్టీని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ పార్టీ సిద్ధాంతాలు, జెండా, ఎజెండా వంటి అంశాల‌పై కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు.

అంతే కాదు ఈ పార్టీ ప్రజల పార్టీ వారి అభిప్రాయాలకు పెద్ద పీట వేస్తా అంటూ.. ట్విట్ట‌ర్‌లో ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రజల ఆశయాలే… పార్టీ సిద్ధాంతాలు.. పార్టీ ఎజెండాను ప్రజలే రాయాలి … ప్రతి బిడ్డ ఒప్పుకునేలా ఉండాలి.. సలహాలు, సూచనలు కొరకు వాట్స‌ప్ నంబ‌రు 8374167039కు పంపండి లేదా [email protected]కు ట్వీట్ చేయండి’ అని ఆమె ప్ర‌జ‌ల‌ను కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -