Friday, May 24, 2024
- Advertisement -

మోక్షజ్ఞ హీరోగా చేయడా..? మరి ఏం చేస్తాడో తెలుసా..?

- Advertisement -
nandamuri mokshgna not interested tollywood sensat

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినిమా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మోక్షజ్ఞ ఎంట్రీపై ఉంటుందంటూ హడావిడి చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ఉంటుందంటూ వార్తలు వచ్చాయి.

కాని ఆ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. బాలయ్య నటించిన శాతకర్ణి సినిమాలో మోక్షజ్ఞ తొలిపరిచయం ఉంటుందని అన్నారు. కానీ అది కుదరలేదు. క్రిష్ దర్శకత్వంలోనే మోక్షజ్ఞ హీరోగా సినిమా ఉంటుందని.. లవ్ స్టోరీతో కూడిన ఆ సినిమా కథా చర్చలు నడుస్తున్నాయని అన్నారు. ఆ వార్తలో కూడా నిజం లేదని తెలిసింది. ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతున్న షాకింగ్ న్యూస్ ఏంటంటే.. నందమూరి బాలయ్య వారసుడు మోక్షజ్ఞకు అసలు సినిమాలంటే ఇష్టం లేదట. హీరోగా కూడా చేయడానికి రెడీగా లేడని తెలుస్తోంది. తనకు బిజినెస్ చేయాలని ఉందని అంటున్నాడట. ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియదు కాని ఈ న్యూస్ మాత్రం నందమూరి ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేస్తున్నాయి.

మోక్షజ్ఞ ఎంట్రీ ఎవరూ ఉహించని విధంగా ఉంటుందని అనుకున్నారు. కానీ వస్తున్న వార్తలు మాత్రం సిని ప్రియులను కంగారు పెడుతున్నాయి. ఇంకో పక్క మాత్రం మోక్షజ్ఞ ఇప్పటికే యాక్టింగ్ కోర్స్ లో నటనా శిక్షణ నేర్చుకున్నాడు.. కాబట్టి హీరోగా ఎంట్రీ ఇవ్వడం పక్కా అని అంటున్నారు. శాతకర్ణి సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా కూడా పనిచేశాడు మోక్షజ్ఞ. మరి ఇన్ని చేసిన మోక్షు ఫ్యాన్స్ కోరిక మేరకు హీరోగా తెర మీద కనిపించడు అంటే ఎలా నమ్ముతారు చెప్పండి. సో ఈ వార్తలన్నిటికి ఫుల్ స్టాప్ పడాలంటే మోక్షజ్ఞ మొదటి సినిమా ఎనౌన్స్ మెంట్ జరగాల్సిందే.

Related

  1. బాలయ్య పరువు తీసిన జనం.. దున్నపోతుతో ఊరేగిస్తూ దారుణంగా
  2. బాలకృష్ణ తప్పిపోయాడంట.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్
  3. బాలయ్యకు.. సుధీర్ బాబు కు మధ్య గొడవ… ఎందుకంటే..?
  4. షాకింగ్ : హైప‌ర్ ఆదిని చంపేస్తానని బాల‌య్య వార్నింగ్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -