Wednesday, May 22, 2024
- Advertisement -

బాలయ్యకు.. సుధీర్ బాబు కు మధ్య గొడవ… ఎందుకంటే..?

- Advertisement -
Sudhir Babu in Balakrishna Movie

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ తన 101వ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు పూరి మరొక సంచలనానికి రెడీ అవుతున్నారు. ఈ మూవీలో బాలకృష్ణకు విలన్ గా సుధీర్ బాబును ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హీరోగా సుధీర్ బాబు చేసిన సినిమాల్లో మహేష్ బావగా అతడికి గుర్తింపు వచ్చింది. అయితే అన్ని పర్వాలేదు అనిపించిన సినిమాలే.. సరైనా హిట్ మాత్రం లేదు.

మహేష్ లాంటి టాప్ హీరో సపోర్ట్ ఉన్నా సుధీర్ బాబు పట్ల టాప్ డైరెక్టర్లు ఎవ్వరూ పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. ఈ క్రమంలో సుదీర్ బాబు గత సంవత్సరం బాలీవుడ్ మూవీ ‘బాఘీ’ లో టైగర్ ష్రాఫ్ కు విలన్ గా నటించాడు. ఈ మూవీలో అతడి నటనకు మంచి పేరు కూడ వచ్చింది. అయితే ఆ తరువాత కూడ సుదీర్ బాబు గురించి టాలీవుడ్ బాలీవుడ్ లు పెద్దగ పట్టించుకోలేదు.

ఇలాంటి పరిస్థుతులలో బాలయ్య 101వ సినిమాకు పూరి సుధీర్ ను ఎంపిక చేయడమే కాకుండా ఈ కాంబినేషన్ కు పూరి బాలకృష్ణను ఒప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ‘లెజెండ్’ సినిమాలో బాలయ్య జగపతి బాబుకు విలన్ గా లిఫ్ట్ ఇచ్చినట్లుగా ఇప్పుడు మహేష్ బావ కు లిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఒక్క ‘లెజెండ్’ మూవీ జగపతిబాబు కెరియర్ కు టర్నింగ్ ఇచ్చినట్లుగా.. బాలయ్య తాజా సినిమా సుధీర్ బాబు కెరియర్ ను మార్చబోతోంది. మరి ఈ సినిమా సుధీర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి. 

Related

  1. బాలయ్య సినిమాపై మహేష్ కామెంట్స్!
  2. అఖిల్ పై ఘోరమైన కామెంట్స్ చేసిన బాలయ్య
  3. బాలయ్య, ఎన్టీఆర్ మధ్య మరోసారి గొడవలు?
  4. బన్నీపై ఫైర్ అవుతున్న.. పవన్, బాలయ్య ఫ్యాన్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -