Tuesday, April 23, 2024
- Advertisement -

డాక్టర్ల కోసం నాని స్పెషల్ ట్రీట్.. ఏమిటంటే?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి సినిమా కుటుంబ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ హీరో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను ఘనంగా పెట్టి మనకు ప్రాణభిక్ష పెడుతున్న డాక్టర్ల కోసం నాని ఓ స్పెషల్ వన్ తో మన ముందుకు రాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఈ క్రమంలోనే మన హీరోల కోసం అంటూ మ్యూజిక్, లవ్, డాక్టర్ ఎమోజీలను ఉంచాడు. ఈ క్రమంలోనే నాని పోస్ట్ చేసిన స్టిల్ చూస్తే ఒక చేత్తో కెమెరా పట్టుకుని డిస్ ప్లేను ఎంతో తీక్షణంగా గమనిస్తున్నాడు. అదేవిధంగా నానీ చుట్టూ పలువురు ఉండి మాస్కులు ధరించి ఎంతో శ్రద్ధగా చూస్తున్నారు. ప్రస్తుతం నాని పోస్ట్ చేసిన ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:ఆ ముగ్గురు స్టార్స్ తో నటించాలనుంది.. బాలీవుడ్ నటి కోరికలు మామూలుగా లేవుగా?

ఈ పోస్ట్ చూసిన పలువురు నెటిజన్లు నాని డాక్టర్ల కోసం ఏం చేయబోతున్నారు? డాక్టర్ పాత్రలో ఏదైనా కొత్త సినిమా తీయబోతున్నాడా అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే నాని ఈ విషయంపై స్పందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే నాని హీరోగా సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న “టక్ జగదీష్” విడుదలకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా “శ్యామ్ సింగరాయ్” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Also read:భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -