Thursday, May 23, 2024
- Advertisement -

అఖిల్ కి మళ్లీ స్టార్ట్ అయిన కొత్త తలనొప్పి..

- Advertisement -
Negative Feedback For Akhils Junnu

అఖిల్ నటించిన మొదటి సినిమా ప్లాప్ కావడంతో ఏడాదిన్నర గ్యాప్‌ తీసుకొని తన రెండో సినిమాతో ఇప్పుడు రాబోతున్నాడు. ఈ రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మనం, 24 చిత్రాల దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా కోసం ‘జున్ను’ అనే టైటిల్‌ ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఈ టైటిల్ పై ఇంతవరకు అధికారిక సమాచారం లేకపోయిన.. ‘జున్ను’ టైటిల్‌పై విక్రమ్‌ కుమార్‌ పట్టు పట్టినట్టు టాక్‌ జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ టైటిల్‌ లీక్‌ అయిన దగ్గర్నుంచి సోషల్‌ మీడియాలో బాగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘జున్నా… పెరుగేం కాదా?’ అంటూ కామెంట్లు పడుతున్నాయి. అక్కినేని ఫ్యాన్స్ సైతం ఈ టైటిల్ కి నెగెటివ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. ‘ఈ టైటిల్‌ వద్దు’ అంటూ అఖిల్‌కి ట్విట్టర్లో వేలాదిగా సందేశాలు అందుతున్నాయి.

ఇంత నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ చూసి అఖిల్‌ క్యాంప్‌ వర్రీ అవుతోందట.  ఈ టైటిల్‌ వద్దని విక్రమ్‌కి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తోందట. . ఏదైనా క్లాసీ టైటిల్‌ అయితే బాగుంటుందని సూచించిందట. కానీ తన సినిమా టైటిల్స్‌ షార్ట్‌ అండ్‌ ‘స్వీట్‌’గా వుండాలని కోరుకుంటాడు విక్రమ్‌ కుమార్‌. ఇంతవరకు అతని సినిమాల టైటిల్స్‌ అన్నీ రెండక్షరాలో రెండు నంబర్లో కావడం విశేషం. మరి ఈ ‘జున్ను’ టైటిల్‌ అతనికి ఎందుకంత టేస్టీగా అనిపిస్తుందో తెలీదు కానీ దీనికంటే బెటర్‌ సౌండింగ్‌ వున్న సింపుల్‌ టైటిల్‌ చూడమని అతడిని రిక్వెస్ట్‌ చేసారట. 

{youtube}v=vlL9Z99HSZo{/youtube}

Related

  1. అఖిల్ పెళ్లి క్యాన్సిల్ త‌ర్వాత నాగ్ మొదటి రిప్లే
  2. అఖిల్, శ్రీయాలను కలిపేందుకు.. రంగం లోకి దిగిన ఉపాసన
  3. అఖిల్ ఎందుకు బయపడుతున్నాడో తెలుసా…?
  4. అఖిల్ పెళ్లి క్యాన్సిల్‌కు అసకు కారణం ఇదే.. బయటపడ్డ నిజాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -