Friday, May 17, 2024
- Advertisement -

షాకింగ్ : రెజీనా తల్లైయింది

- Advertisement -
nenjam marappathillai trailer talk

రెజీనా తల్లి కావడం ఏంటి.. అని కంగారు పడకండి. అసలు విషయం వేరే ఉంది. ఈ మధ్య హారర్ సినిమాల ట్రెండ్ బాగా ఎక్కువ అయ్యింది. ఇదివరకు ఈ హారర్ సినిమాలు చిన్న చితకా హీరోయిన్లు, హీరోలు మాత్రమే చేసేవారు. ఇప్పుడు మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్లు కూడా ఇటువైపు చూస్తున్నారు. ఈ జాబితాలోనే ఇప్పుడు రెజీనా చేరిపోయింది. తమిళ దర్శకుడు ఎస్.జె సూర్య ప్రధాన పాత్రలో ‘నెంజం మరప్ప దిల్లై’అనే సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో రెజీనా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకి సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజా ఈ చిత్రంకు సంబంధించిన ట్రైలర్ బయటికివచ్చింది. ఇదో సస్పెన్స్ హారర్ సినిమా. ఈ సినిమాలో రెజీనా ఓ బాబుకు తల్లిగా నటిస్తోంది. అలాగే ఆమెది దెయ్యం పాత్ర. ఇక ఈ సినిమా కథ విషయంకు వస్తే… రెజీనా-సూర్య భార్య భర్తలు. ఓ బాబు కూడా ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో రెజీనా పాత్ర హత్యకు గురవుతుంది. ఆ తర్వాత పిల్లాడి కోసం రెజీనా ఆత్మగా తిరిగి వస్తుంది.

సూర్య రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ బాబు సూర్య దగ్గరే వుంటాడు. అసలు తన హత్యకు కారణం ఏమిటి? హత్య చేసిన వారిపై పగ ఎలా తీర్చుంకుటుంది ? అన్నది తెరపై చూడాలి. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. సూర్య, రెజీనా ఉండటంతో ఈ చిత్రంను తెలుగులో కూడా విడుదల చేడడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెజీనాకు ఇది తొలి హారర్ సినిమా. ఇప్పటివరకు రెజీనా హారర్ సినిమా చేయలేదు. మరి మొదటి సారిగా చేస్తున్న ఈ సినిమా రెజీనాకు ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

{youtube}mK3pv46s4v4{/youtube}

Related

  1. రెజీనా.. సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుంది!
  2. రెజీనా ఎఫైర్ సంగతి బయటపెట్టింది!
  3. సెక్స్ వ‌ర్క‌ర్ల సీక్రెట్స్!
  4. చిరు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుస్తే దిమ్మతిరగాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -