టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు రెజీనా. అయితే ఇప్పుడు రెజీనా సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసేసుకుంది. ఈ సంగతి ఎవరికి తెలియదు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ సంగతిని ఆమె స్వయంగా తెలియజేసింది. గురువారం తనకు కావాల్సిన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది. రెజీనా నిశ్చితార్థం జరిగినట్టు ఎంగేజ్‌మెంట్ రింగులు మార్చుకున్న ఫొటోను మాత్రమే ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది.
ఈ ఫోటోలో కేవలం చేతులకు ఉన్న రింగులు మార్చుకున్నట్టు మాత్రమే కనిపిస్తోంది. రెజీనా నిశ్చితార్థం చేసుకున్న వ్యక్తి ఎవర్నది మాత్రం తెలియడం లేదు. అలాగే ఈ ప్రత్యేకమైన రోజున తనకు బ్లెస్సింగ్స్ కావాలంటూ అభిమానుల్ని కోరింది. ఇక తాను పెళ్లాడబోయే వ్యక్తి ఎవరన్నది అందరికి చెప్పాలని..అతడిని చూపించాలన్న కోరిక తనకు ఉందని…అయితే అది ఇప్పుడే కాదు..త్వరలోనే అంటూ చిన్న ట్విస్ట్ ఇచ్చింది.
దీంతో రెజీనా పెళ్లి చేసుకునేది ఎవరన్న సస్పెన్స్ అందరిలోను నెలకొంది. రెజీనా ఇంత సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో అందరూ షాక్ అయిపోతున్నారు. ఇది నిజమా లేదా ఏదైనా సినిమా ప్రమోషన్‌లో ఇలా షాక్ ఇస్తుందా అని చర్చించుకుంటున్నారు. రెజీనా ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Related
