Monday, April 29, 2024
- Advertisement -

ముద్దు సీన్ ఉంది… రిహార్సల్స్ అంటూ అసభ్యకరంగా ప్రవర్తించిన దర్శకుడు: జరీన్ ఖాన్

- Advertisement -

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ గత రెండు సంవత్సరాల క్రితం మీటు ఉద్యమం ద్వారా ఎంతోమంది సెలబ్రిటీలు వారి కెరీర్లో ఎంతో మంది దర్శక నిర్మాతల వల్ల ఎంతో మంది తారలు ఇబ్బంది పడ్డారనే విషయాన్ని తెలియజేశారు. ఈ క్రమంలోనే నటి జరీన్‌ ఖాన్ కూడా కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

సల్మాన్‌ ఖాన్‌ సినిమాతో పరిచయమైన హీరోయిన్‌ జరీన్‌ ఖాన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కెరియర్ మొదట్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని,కానీ తను ఆ విధంగా ఇబ్బందులకు గురి చేసిన వారి పేర్లను బయట పెట్టాలనుకోవడం లేదంటూ తెలిపారు. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఓ వ్యక్తి పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తి నా ముందు ఎంతో అమాయకంగా నటించి, అతను సినిమాలలో నటించే అవకాశాలను కల్పిస్తానని తనతో చెప్పినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

Also read:రామ్ కోసం విలన్ గా మారనున్న స్టార్ యాక్టర్..?

ఈ క్రమంలోనే తన సినిమాల్లో ముద్దు సీన్ ఉంటుందని, ఆ సీన్ కోసం ముందుగా రిహార్సల్స్ చేయాల్సి ఉంటుందని ఎంతో అసభ్యకరంగా మాట్లాడాడు. మనసులో ఉన్న భయాలు అన్నింటిని పక్కనపెట్టి నాతో సరదాగా ఉంటే నీకు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని దర్శకుడు చెప్పాడనే విషయాన్ని తాజాగా నటి తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే హౌజ్‌ఫుల్‌ 2, హేట్‌ స్టోరీ 3, అక్సర్‌ 2’తో పాటు మరిన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో గోపిచంద్‌ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలోను నటించింది.

Also read:హాలీవుడ్ సినిమా తీయనున్న రాజమౌళి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -