Sunday, May 5, 2024
- Advertisement -

ఆ స్టార్ హీరోలపై కన్నేసిన నిధి అగర్వాల్… మాములు జోరు కాదుగా!

- Advertisement -

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరో రామ్,పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్ ” సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సూపర్ పాపులర్ అయ్యింది. అయితే తెలుగు ఇండస్ట్రీలో ఆమె మొదటి చిత్రం నాగచైతన్య హీరోగా వచ్చిన “సవ్యసాచి” తర్వాత వచ్చిన “మిస్టర్ మజ్ను’ తగిన గుర్తింపు ఇవ్వలేదు. నిధి అగర్వాల్ బాలీవుడ్ లో మొదటి చిత్రం ‘మున్నామైఖెల్‌’ తొలి సినిమాతోనే అక్కడ అందాలు ఆరబోసి అదరగొట్టింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ ఇస్మార్ట్ అందాలతో తెలుగు , తమిళ ఇండస్ట్రీలో రచ్చ చేస్తోంది.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో నిధి అగర్వాల్ కు టాలీవుడ్లో స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన “హరి హర వీరమల్లు” అనే పిరియాడిక్ కథాంశంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Also read:చిట్టి చిట్టి దోశలతో అర్హ ప్రత్యేక్షం.. బన్నీ ఎమోషనల్!

తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో హీరోయిన్‌గా హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను సంప్రదిస్తున్నట్టు తాజా సమాచారం. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే కూడా నటిస్తున్నట్లు సమాచారం. కానీ ఆమె ఇప్పటికే చేయాల్సిన సినిమాలు చాలా ఉండడంతో ఆ అవకాశం నిధికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం పై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.

Also read:త్రిషకు ఇదే లాస్ట్ బ్యాచిలర్ బర్త్ డే అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -