Saturday, April 20, 2024
- Advertisement -

గుజరాత్ లో దారుణం.. ఐసీయూ వార్డులో మంటలు.. ఆరుగురు కొవిడ్ రోగుల సజీవ దహనం!

- Advertisement -

ఈ ఏడాది ఎంత దారుణంగా ఉందంటే మనిషి ప్రతి నిమిషం భయంతొో బతికే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది మార్చి నెల నుంచి కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మొదలైంది.. దాంతో ఇప్పుడు ప్రజలు మళ్లీ గజ గజ వణికి పోతున్నారు. ఇది చాలదని ఇప్పుడు ప్రకృతి పరంగా విపత్కర పరిస్తితి మొదలైంది. తుఫాన్, భూకంపాలు, భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నారు.

తాజాగా గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో ఈ తెల్లవారుజామున చెలరేగిన మంటల్లో ఆరుగురు కొవిడ్ రోగులు సజీవ దహనమయ్యారు. రాజ్‌కోట్‌, మావ్‌డీ ప్రాంతంలోని శివానంద్ జనరల్ అండ్ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ ఆసుపత్రిలో జరిగిందీ. ప్రస్తుతం ఇక్కడ 33 మంది ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు.

అయితే వీరిలో ఏడుగురు ఐసీయూలో చికిత్స పొందుతుండగా, ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.  సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇప్పటి వరకు 27 మందిని రక్షించారు. అయితే ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. కాగా, షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -