Thursday, April 25, 2024
- Advertisement -

లాక్ డౌన్ ఎఫెక్ట్: పెయింటర్ గా మారిపోయిన బిగ్ బాస్ కంటెస్టెంట్?

- Advertisement -

బుల్లితెరలో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్ లు ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాలు సీరియల్స్ లో తన విలనిజాన్ని ప్రదర్శించేవారు బిగ్ బాస్ హౌస్ ద్వారా తన నిజరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్ లు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా సందడి చేసిన సామ్రాట్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుంచి ఒకే విధమైన ఆట రీతిని ప్రదర్శించి చివరి వరకు నిలిచాడు.

కూల్ అండ్ కామ్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకున్న సామ్రాట్ నిజ జీవితంలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు.మొదటి భార్యతో విడాకులు తీసుకున్న సామ్రాట్ తాజాగా రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా, సీరియల్ షూటింగ్ వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు ఇంటికే పరిమితమై వారికి తోచిన పనులలో నిమగ్నమయ్యారు.

Also read:ఆ వివాదం పై సమంత స్పందించక పోవడానికి కారణం అదే!

ఈ క్రమంలోనే సామ్రాట్ ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తోచక పెయింటర్ గా మారిపోయాడు. ఇంట్లో ఉన్నటువంటి పూల కుండీలకు పెయింటింగ్ వేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సామ్రాట్ అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

Also read:బిగ్ బాస్ లోకి చిన్నారి పెళ్ళికూతురు… షో ఎప్పుడు ప్రారంభమంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -