Thursday, May 16, 2024
- Advertisement -

బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ తో ఎన్టీఆర్ కి ఏం సంబంధం..?

- Advertisement -
ntr fans baahubali interval scene video

స్టార్ హీరోల సినిమాల మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వారి సినిమాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ చేసే హంగామా అంత ఇంత కాదు. ఓ హీరో సినిమా హిట్ కొడితే.. ఆ హీరో ఫ్యాన్స్ హంగమా అంత ఇంత కాదు. మరో హీరో సినిమా హిట్ కొడితే ఆ హీరో ఫ్యాన్స్ కూడా అంతే హంగామా చేస్తారు. అయితే హీరోలు ఎలా ఉన్న ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్పోడు అంటే మా హీరో గొప్పోడు అని చెపుతుంటారు. అంతే కాకుండా.. సోషల్ మీడియాలో రకరకల పోస్టులు పెడుతుంటారు.

ఇప్పుడు ఇదంత ఎందుకంటే.. పవన్ కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ కొత్త నినాదాన్ని మొదలు పెట్టేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఇటివలే రిలీజ్ అయిన బాహుబలి సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీన్‌ని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో రాశామని విజయేంద్రప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే. ఓ పంక్షన్ లో పవన్ పేరు చెప్పగానే ఫ్యాన్స్ చేసిన హంగామా చూసి.. దానిలాగే ఇంటర్వెల్ సీన్ రాశామని ఆయన అన్నారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న పవన్ ఫ్యాన్స్ ఈ విషయంపై సోషల్ మీడీయాలో పవన్ గ్రేట్ అంటూ రచ్చ రచ్చ చేశారు. ఇది చూసి ఓర్వలేకో మరి తమ హీరో కూడా గ్రేట్ అని చెప్పుకోవడానికో తెలీదు కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఓ వీడియోని వెతికి బయటకు తీసారు.

ఆ వీడియోలో హరికృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరు చెప్పగానే.. ఆ వేడుకకు వచ్చిన ఫ్యాన్స్ ఒక్కటే అరుపులు, కేకలు. ఆ వీడియోని ఇంటర్వెట్‌లో పోస్ట్ చేసి.. ఇది కూడా ‘బాహుబలి-2’ ఇంటర్వెల్ సీన్ అంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆ వీడియో ట్రెండ్ అవుతోంది. ఎంతైనా అభిమానులు గ్రేట్.. తన హీరో ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకూడదని నిత్యం తాపత్రయం పడుతూనే వుంటారు. హీరోల స్థాయి పెంచేవిధంగా నానాతంటాలు పడుతూనే వుంటారు. కాకపోతే.. ఒక హీరోకి విరుద్దంగా ఇలా ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. తమ హీరోనే గొప్పంటూ పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌తో చేసుకుంటే ఫర్వాలేదు కానీ, తమ హీరోనే గొప్పంటూ చెప్పడం మరీ విడ్డూరం.

{youtube}_Ca2OpfdtZQ{/youtube}

{youtube}dDKZXsb6Eo4{/youtube}

Related

  1. రాజమౌళి నెక్ట్స్ సినిమా ఎన్టీఆర్ తోనే
  2. బాహుబలి 2 పై ఎన్టీఆర్ సంచలన కామెంట్స్
  3. ఎన్టీఆర్ పై కోపడ్డ లక్ష్మీ ప్రణీత.. ఏం జరిగింది..?
  4. ఎన్టీఆర్ తో రొమాన్స్ చేస్తున్న నందిత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -