Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ బాహుబలి.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది

- Advertisement -
Pawan Kalyan Baahubali 2 Look

‘బాహుబలి 2’ లో‘అమరేంద్ర బాహుబలి’ పాత్రలో ప్రభాస్ ని తప్ప మరొకరిని ఊహించుకోలేమని కామెంట్స్ వస్తున్నాయి. అయితే అమరేంద్ర బాహుబలి గా మరొక హీరోని ఊహించుకోలేని పరిస్థుతులలో అమరేంద్ర బాహుబలిగా మరొక టాప్ హీరో ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈఫోటో ఎవరి ఊహల నుండి వచ్చిందో అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఈ ఫోటోలో అమరేంద్ర బాహుబలిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. ‘బాహుబలి 2’ పోస్టర్ ను మార్ఫింగ్ చేస్తూ.. ప్రభాస్ ఉన్న ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఫోటోను పెడుతూ సోషల్ మీడియాలో ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అమరేంద్ర బాహుబలిగా గడ్డం పెంచుకుని ఉన్న పవన్ లుక్ కూడా ప్రభాస్ లుక్ కు సరిపోవడంతో ఇప్పుడు ఈఫోటో పవన్ అభిమానులకు ట్రెండ్ సెటర్ గా మారింది.  మామూలుగా ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో కనిపిస్తే వెంటనే వాటిని టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి.

కానీ ఈ ఫోటోపై ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ రాకపోవడం చూస్తే.. అమరేంద్ర బాహుబలిగా పవన్ లుక్ చాలా మందికి నచ్చిదనడంలో సందేహం అవసరం లేదు. ఇది ఇలా ఉండగా ‘బాహుబలి 2’ 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకునే మొదటి సినిమాగా రికార్డులు సృష్టించడానికి మరో రెండు రోజుల సమయం సరిపోతుంది అని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా 700 కోట్లకు పైగా గ్రాస్ కలక్షన్స్ ను దాటయడంతో ఎట్టి పరిస్తుతులలోను 1000 కోట్ల సినిమాగా మారి తీరుతుందని అంటున్నారు. పవన్ ‘బాహుబలి’ లుక్ చాలామందికి నచ్చింది కాబట్టి రానున్న రోజులలో పవన్ ను ఇలాంటి పాత్రలలో కూడ చూసే చాన్స్ ఉంటుందేమో చూడాలి.

{youtube}2Qy4_3m44U0{/youtube}

Related

  1. పవన్ కి బాహుబలి 2 నచ్చలేదా..?
  2. బాహుబలి 2 తో పవన్ కి ఏం సంబంధం..? అసలు సీక్రెట్ ఇదే..
  3. పవన్ జనసేన పార్టీకి చరణ్ మద్దతు..?
  4. పవన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రాశి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -