Saturday, April 27, 2024
- Advertisement -

టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన శ్రద్ధ శ్రీనాథ్.. నిజమేనా?

- Advertisement -

శ్రద్ధా శ్రీనాథ్ ఈమె గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కి జెర్సీ సినిమా ద్వారా పరిచయమైన శ్రద్ధ శ్రీనాథ్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకొని కెరియర్లో విజయ పథంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తమిళ, తెలుగు, కన్నడ ఇలా అన్ని భాషల్లో నటించిన ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తెలుగు ఇండస్ట్రీ లో కేవలం ఒకే ఒక్క సినిమా ద్వారా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్ జెర్సీ సినిమా తర్వాత కృష్ణ అండ్ హిస్ లీలా అనే సినిమాల్లో నటించి మరోసారి అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ మరోసారి తెలుగు తెరపై కనిపించలేదు. తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ కుదరదని పక్కన పెట్టేస్తున్నట్టు సమాచారం.

Also read:బుల్లితెరపై టాప్ 5 యాంకర్స్ వీళ్ళే!

శ్రద్ధ ఈ విధంగా సినిమాలను పక్కన పెట్టడానికి గల కారణం ఆమెకు కథలు నచ్చలేదని సమాచారం కూడా వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం కోలీవుడ్లో ఎంతో బిజీగా ఉండటం వల్లే తెలుగు సినిమాలు పూర్తిగా పక్కన పెట్టేసిన్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Also read:గొప్ప మనసు చాటుకున్న నవీన్ పోలిశెట్టి… అభిమానికి బిగ్ సర్ప్రైజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -