ఓటీటీలో విడుదల కానున్న అఖిల్ సినిమా.. నాగార్జున షాకింగ్ నిర్ణయం?

- Advertisement -

ఇండస్ట్రీలో అక్కినేని నట వారసునిగా నాగార్జున కొడుకు అఖిల్ యాక్షన్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ అఖిల్’ సినిమాతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.తర్వాత హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు అక్కినేని అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

ప్రస్తుతం అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా రెండేళ్ల క్రితం మొదలవ్వగా ఇంతవరకు రిలీజ్ కు నోచుకోలేదు. తాజాగా విడుదల తేదీలను ప్రకటించగా కరోనా పరిస్థితుల కారణంగా మళ్లీ వాయిదా పడింది. ఇక థియేటర్స్ లో రిలీజ్ చేయాలి అంటే మరో మూడు నెలలు ఆగాలి. అప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసినా ఫలితం ఉండదు. కాబట్టి ఇప్పుడే ఓటీటీ లో రిలీజ్ చేయాలని నిర్మాతలు ఇటీవల చర్చలు జరపగా అందుకు నాగార్జున సమ్మతంగా లేరని, కొడుకు సినిమాను థియేటర్లోనే రిలీజ్ చేయించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also read:టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన శ్రద్ధ శ్రీనాథ్.. నిజమేనా?

అఖిల్ కెరీర్ విషయానికి వస్తే తన ఐదో సినిమా సైరా నరసింహ రెడ్డి ఫేమ్ సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు.అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో ఈ సినిమాలో మొదటిసారి కనిపించనున్నాడు. ఇటీవల అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘ఏజెంట్’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా, అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

Also read:సాయి పల్లవికి పొగరు.. నిర్మాత కూడా సీరియస్..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -