సినిమాల గురించి తన ట్విట్టర్ ఖాతాని ఎప్పుడు వాడుకోలేదు పవన్ కళ్యాణ్. జన సేన పార్టీ సంబంధించిన అప్డేట్స్ తప్ప మరో ఇతర విషయాల గురించి మాత్రం పవన్ మాట్లాడకపోయేది. కానీ ఆ మధ్య దంగల్ సినిమా గురించి ట్వీట్ చేసి ఆశ్చర్యానికి గురి చేసాడు. ఆ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించిన పవన్ ఆ తర్వాత తన అన్న చిరంజీవి ఖైదీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ టైం లో ఆయన్ని ఇండస్ట్రీ కి రీ వెల్కం చెబుతూ ట్వీట్ వేసాడు.
ఆ తర్వాత సినిమాల గురించి మాట్లాడని పవన్ బాహుబలి విషయం లో నోరు మెదపడం లేదు. ‘బాహుబలి 2’ వచ్చే ఇంటర్వెల్ సీన్‌కి స్ఫూర్తి పవన్‌కళ్యాణ్ అంటూ రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పడంతో ఈ చిత్రంతో పవన్‌కి ఇన్‌డైరెక్ట్ కనక్షన్ ఏర్పడింది. బాహుబలి 1 టైం లో కూడా అందరూ ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటె పవన్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు . పైగా ఆర్కా మీడియా వారితో పవన్ కి మంచి అనుబంధం ఉంది. పవన్ తో వారు పంజా సినిమాని నిర్మించారు.
తెలుగులో అందరు టాప్ స్టార్లు బాహుబలి గురించి స్పందించేసారు. కానీ పవన్ మాత్రం తన అభిప్రాయాన్ని చెప్పలేదు. మరో పక్క బాహుబలి స్పెషల్ షో వేయించుకున్నాడు అనీ అతనికి సినిమాలో డెప్త్ కనపడలేదు అనీ ఆ చిత్రం అతనికి అసలు నచ్చలేదు అనీ అందుకే రెస్పాండ్ అవ్వడం లేదు అని వార్తలు వినిపిస్తోంది.
{youtube}fjXWYgAOreY{/youtube}
Related